Bigg Boss Telugu చరిత్రలో మొదటిసారి.. లవర్ కోసం ఆగలేక వచ్చేసిన దీప్తి.. ఐ లవ్యూ అంటూ!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే వారం పూర్తికాగా ఇప్పుడు రెండో వారంలోకి ఎంటర్ అయింది. దాదాపుగా ఇప్పటికే మూడు రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ రోజు షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు కావడంతో బిగ్ బాస్ అతనికి మరచిపోలేని ఒక గిఫ్ట్ అందించాడు.. స్పెషల్ సర్ప్రైస్ తో పాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా బిగ్ బాస్ తాజా ప్రోమోలో చూపించాడు. అసలు ఏమిటో ఆ సర్ప్రైస్ అనే వివరాల్లోకి వెళితే

 అలా ఫేమస్

అలా ఫేమస్

షణ్ముఖ్ జస్వంత్ మొదటి నుంచి కూడా తనదైన డాన్సులు కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ జస్వంత్ చేసే కామెడీ వీడియోలకు సైతం అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. షణ్ముఖ్ యశ్వంత్ చేసిన వైవా, సాఫ్ట్వేర్ డెవలపర్, అలాగే సూర్య వెబ్ సిరీస్ బాగా సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఎలాంటి వీడియోలు చేసినా ఆయన ఫ్యాన్స్ ఆదరిస్తూ వచ్చారు.

ముందు నుంచి స్నేహితులం అంటూనే

ముందు నుంచి స్నేహితులం అంటూనే

అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి కొన్నాళ్లపాటు హౌస్ లో ఉండి బయటకు వచ్చేసిన దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ దీని గురించి నేరుగా స్పందించిన దాఖలాలు లేవు అప్పుడప్పుడూ తాము స్నేహితులమే అన్నట్లుగా హింట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే షణ్ముక్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చాక దీప్తి సునయన కి షణ్ముక్ కి మధ్య ఏదో ఉంది అనే సంకేతాలు కొన్నిసార్లు బయటకు వదిలాడు.

 దీప్తి లవ్

దీప్తి లవ్

హౌస్ లో కూడా ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ హమీదా దీప్తి గురించి మాట్లాడుతూ ఉంటాడని మరో కంటెస్టెంట్ అయిన విశ్వ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. జనం అప్పుడు లైట్ తీసుకున్నారు కానీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ వివరాలన్నీ బయటికి వచ్చేశాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో ఎప్పటిలాగే ఆర్ జి కాజల్ హమీదాలో నీకు నచ్చిన మూడు విషయాలు చెప్పమని షణ్ముఖ్ జస్వంత్ అని అడుగుతుంది.

హమీదా హాట్

హమీదా హాట్

దానికి షణ్ముక్ సిగ్గుపడుతూ హమీద హాట్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు, షణ్ముఖ నుంచి ఈ కామెంట్ వినడం ఆలస్యం రవి తదితరులు ఆటపట్టించారు. ఇక షణ్ముఖ్‌ పుట్టినరోజు సందర్భంగా హౌస్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ సందర్భంగా హమీదా-షణ్ముఖ్ లను రవి, లహరి ఆటపట్టించగా రవి చేసిన కామెంట్స్ ను హమీదా కూడా సరదాగా తీసుకుని ఎంజాయ్ చేసింది.

Recommended Video

Nee Jathaga Movie Official Teaser

ఐలవ్యూ చెప్పిన దీప్తి

అయితే షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, షన్నూ ప్రియురాలు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆమె తన టీం తో కలిసి వెళ్లి బిగ్ బాస్ హౌస్ బయట టపాసులు పేల్చారు. అనంతరం హౌస్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. దీప్తి సునైనా ఒక స్పెషల్ వీడియోలో కనిపించి ఐ లవ్ యూ చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో షణ్ముఖ్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X