బిగ్ బాస్ హౌస్‌లో రియల్ ఫైట్: మగాడివి అయితే రా అంటూ అతడిపై ప్రియ షాకింగ్ కామెంట్స్

తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలే మాత్రం తెలియని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ఇక్కడి ఆడియెన్స్ ఊహించని విధంగా స్పందనను అందించారు. దీంతో ఇది సూపర్ డూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో విజయవంతంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుని.. ఇటీవలే ఐదో దాన్ని నిర్వహకులు మొదలు పెట్టారు. ఇది ఆరంభం నుంచే గొడవలు, కొట్లాటలతో రచ్చ రచ్చగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు హౌస్‌లో రియల్ ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఐదింతల రచ్చతో సాగుతోన్న సీజన్

ఐదింతల రచ్చతో సాగుతోన్న సీజన్

బిగ్ బాస్ ఐదో సీజన్‌ ప్రారంభానికి ముందే ఈ సారి ఐదింతల ఎక్కువ మజాను అందిస్తామని నిర్వహకులు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లలో ఎప్పుడూ కనిపించని విధంగా ఇందులో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి వారం నామినేషన్స్ టాస్కు సమయంలో మొదలైన రచ్చ.. ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది.

ఈ వారం మరీ దారుణంగా ఫైటింగ్స్

ఈ వారం మరీ దారుణంగా ఫైటింగ్స్

మొదటి వారం పలు గొడవలు, కొట్లాటలు, విమర్శలు ప్రతి విమర్శలతో ఎంతో రంజుగా సాగిన బిగ్ బాస్ ఐదో సీజన్.. రెండో వారంలోనూ అలాగే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో ఓ రేంజ్‌లో ఫైటింగ్స్ జరిగాయి. షో చరిత్రలోనే తొలిసారి బూతు మాటలు కూడా వినిపించాయి. అంతేకాదు, కొట్టుకుంటారా అన్నంత రేంజ్‌లో గొడవలు జరిగాయి.

కెప్టెన్సీ కోసం.. పంతం నీదా నాదా?

కెప్టెన్సీ కోసం.. పంతం నీదా నాదా?

రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ కోసం పోటీ పడే వారిని ఎంపిక చేయడానికి 'పంతం నీదా నాదా' అనే టాస్కును మొదలు పెట్టారు. ఇందులో మొదటి రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లతో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే గేమ్‌ను ఆడించారు. ఇందుకోసం వాళ్లను నామినేషన్స్ టాస్కులో విడగొట్టిగనట్లుగానే రెండు టీమ్‌లుగా ఉంచి పిల్లోలను ఎక్కువ సంపాదించాలని చెప్పారు.

పిల్లోల కోసం కంటెస్టెంట్లు ఫైటింగ్

పిల్లోల కోసం కంటెస్టెంట్లు ఫైటింగ్

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు కోసం ఇరు జట్లలోని కంటెస్టెంట్లు పిల్లోలను సంపాదించుకోడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే గొడవలకు సైతం దిగారు. కొందరైతే నేల మీద పడిపోయి మరీ ఒకరి చేతిలో ఉన్న పిల్లోలను మరొకరు లాక్కోడానికి ప్రయత్నాలు జరిపారు. ఇలా మంగళవారం ఎపిసోడ్ మొత్తం రచ్చ రచ్చగా జరిగింది. దీంతో షోపై మరింత ఆసక్తి పెరిగిపోయిందనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్‌లో నిజమైన ఫైటింగ్

బిగ్ బాస్ హౌస్‌లో నిజమైన ఫైటింగ్

బుధవారం రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా కొద్ది సేపటి క్రితమే వదిలింది. ఇందులో పిల్లో టాస్కును కంటిన్యూ చేశారు. ఈ క్రమంలోనే హౌస్‌లో నిజమైన ఫైటింగ్ జరిగినట్లు కనిపించింది. శ్రీరామ చంద్ర.. ఎదుటి టీమ్‌కు సంబంధించిన యాంకర్ రవి, సన్నీ, మానస్‌లతో గొడవ పడ్డాడు. ఒకానొక సమయంలో కొట్టుకున్నంత పని చేశారు.

నేరుగా వచ్చి గుద్దిన శ్వేత.. దెయ్యం

మొదటి వారం మొత్తం ఎంతో శాంతంగా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారం నామనేషన్స్ టాస్కులో హమీదా, లోబోతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింద. అలాగే, ఈరోజు ఎపిసోడ్‌లో సిరి హన్మంత్‌ను నేరుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో 'నైట్ అయితే దెయ్యం పడుతుందేమో' అని ప్రియ కామెంట్ చేసింది. అలాగే, ఆనీ మాస్టర్ కూడా ఆమె ప్రవర్తనను తప్పుబట్టింది.

మగాడి అయితే రా చూసుకుందాం

మగాడి అయితే రా చూసుకుందాం

ఇదే ప్రోమోలో క్లైమాక్స్‌లో సన్నీతో శ్రీరామ చంద్ర టీమ్ సభ్యులు అందరూ కలిసి గొడవకు దిగారు. ఆ సమయంలో ప్రియ 'మగాడివి అయితే అడుదువు రా' అంటూ సవాల్ విసిరింది. దీంతో సన్నీ 'మీరు మగాడు గిగాడు అని మాట్లాడొద్దూ' అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎంత హై ఓల్టేజ్‌తో జరగబోతుందనేది అర్థం అవుతోంది. ఫలితంగా ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X