Bigg Boss Telugu 5 శ్రీరామచంద్ర నోట బూతు పురాణం.. వీజే సన్నీపై దాడికి ప్రయత్నం

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 12వ వారం నామినేషన్ ప్రక్రియ ఇంటిలో రచ్చ లేపింది.ఇంటి సభ్యులు ఆరుపులు, పెడబొబ్బలతో ప్రక్రియను కొనసాగించారు. ఓ దశలో యాంకర్ రవి, వీజే సన్నీ, అలాగే వీజే సన్నీ శ్రీరామచంద్ర గట్టిగా వాదులాడుకొన్నారు. అయితే ఎవరెవరి మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి. ఎవరు నామినేట్ అయ్యారనే విషయంలోకి వెళితే..

Recommended Video

Bigg Boss Telugu 5 : నామినేష‌న్స్ రచ్చ.. చల్ బే ఛల్ అంటూ Sunny పైకి వెళ్లిన Sri Ram|Filmibeat Telugu
వీజే సన్నీపై రవి ఎటాక్

వీజే సన్నీపై రవి ఎటాక్


నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వీజే సన్నీని యాంకర్ రవి నామినేట్ చేస్తూ.. ఇక నుంచి నీవు మారితే డెఫినెట్‌గా మంచి పర్సన్ అవుతావు అని అన్నాడు. దాంతో నీవు మారమంటే నేను మారితే.. నేనెట్ల అవుతాను అని యాంకర్ రవికి వీజే సన్నీ గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఇక యాంకర్ రవిని షణ్ముఖ్ టార్గెట్ చేస్తూ.. నేను కెప్టెన్‌గా చేసినప్పుడు బెటర్ సంచాలకుడిగా వ్యవహరించాను. పోల్చుకోవాల్సి వస్తే.. ఇంటిలో నీ కంటే బెటర్‌గా అందరూ ఆడుతున్నారు అని షణ్ముఖ్‌ను యాంకర్ రవి అన్నాడు.

ఆర్జే కాజల్‌పై మండిపడ్డ శ్రీరామచంద్ర

ఆర్జే కాజల్‌పై మండిపడ్డ శ్రీరామచంద్ర


ఇక ఆర్జే కాజల్‌కు శ్రీరామచంద్రకు మధ్య భారీగానే మాటల యుద్ధం జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ సందర్భం గురించి శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. ఒకరిని సేవ్ చేసే వీలు ఉన్నప్పుడు నీవు ఇద్దరిని డిస్ట్రాయ్ చేయడం బాగాలేదు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ బ్యాట్‌తో కుండను బద్దలు కొట్టాడు. అయితే నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు నేను నాకు ఇష్టం వచ్చిన విధంగా నిర్ణయం తీసుకొంటాను అని ఆర్జే కాజల్ అన్నారు. దాంతో నీవు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు వాల్యూస్ కూడా మరిచిపోతావు అంటూ శ్రీరామచంద్ర కౌంటర్ ఇచ్చాడు.

నీవు సర్వం అగ్నివి అంటూ శ్రీరామచంద్ర

నీవు సర్వం అగ్నివి అంటూ శ్రీరామచంద్ర

ఆర్జే కాజల్‌తో శ్రీరామచంద్ర వాదన అలానే కొనసాగింది. నీకు వ్యాల్యూస్ లేవు. మాట మీద నిలబడవు. ఎప్పుడు లేడీస్ గెలవాలి అంటూ మాటలు చెబుతున్నావు. ఇద్దరు లేడిస్ పోటీలో ఉన్నప్పుడు ఒకరికి కూడా నీవు సపోర్ట్ చేయలేదు అంటూ శ్రీరామచంద్ర అన్నారు. అయితే నా నిర్ణయం విషయంలో నేను సర్వాగ్నిని అని కాజల్ సమాధానం ఇచ్చింది. అయితే నీవు సర్వాగ్ని కావు.. సర్వం అగ్నివి అంటూ శ్రీరామచంద్ర కామెంట్ చేశాడు.

యాంకర్ రవి నీవు ఫేక్ అంటూ

యాంకర్ రవి నీవు ఫేక్ అంటూ


ఇక యాంకర్ రవికి వీజే సన్నీకి మధ్య భారీ గొడవ జరిగింది. యాంకర్ రవిని నామినేట్ చేస్తూ.. ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడానికి ముందు ఉంటావు. నిజం చెప్పడానికి వెనుక ఉంటావు అని వీజే సన్నీ అన్నాడు. దాంతో నిజం చెప్పడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను అని రవి జవాబిస్తే.. ఇంటిలో నువ్వే ఫేక్ మాస్టర్ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు.

వీజే సన్నీపై శ్రీరామచంద్ర బూతులు

వీజే సన్నీపై శ్రీరామచంద్ర బూతులు

ఇక శ్రీరామచంద్రకు వీజే సన్నీకి వాదన భారీ స్థాయిలో జరిగింది. నువ్వు అక్కడ ఇక్కడ చూసి మాట్లాడకు. నా కళ్లలోకి డైరెక్ట్‌గా చూసి మాట్లాడు అని శ్రీరామచంద్ర అన్నారు. దాంతో మజాక్‌లు ఆడుకొంటూ.. ఫేస్ మీద మాస్కులు పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అని వీజే సన్నీ అంటే.. గ్రూపుతో ఆడుకొంటూ అలా మాట్లాడుతావా అంటే.. నేను ఇలాగే ఉన్నా.. ఒరిజినల్ అని వీజే సన్నీ అంటే.. చల్ బే ఛల్ అంటూ ఏదో మాట వదిలాడు. అయితే ఛల్ బే ఛల్ అనకు. ముందుకు వస్తే బాగుండదు అంటూ వీజే సన్నీవార్నింగ్ ఇచ్చాడు. దాంతో ముందుకొస్తే ఏం చేస్తావు అంటూ వీజే సన్నీపైకి శ్రీరామచంద్ర వెళ్లాడు. దాంతో వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. వారిని సముదాయించేందుకు కెప్టెన్ మానస్ వచ్చాడు.

12వ వారం నామినేషన్‌లో వీరే

ఇదిలా ఉండగా, నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కెప్టెన్ మానస్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. 12వ వారం ఎలిమినేషన్ కోసం వీజే సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక సింగ్, సిరి హన్మంతు, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X