నన్ను పెళ్లి చేసుకుంటావా ? లైవ్ లో విష్ణుప్రియతో రిలేషన్‌పై పృథ్వీ క్లారిటీ..
బిగ్ బాస్ లవ్ బర్డ్స్ అనగానే వెంటనే పృథ్వీరాజ్ శెట్టి -విష్ణుప్రియ పేర్లు గుర్తుకు వస్తాయి. బిగ్ బాస్ తెలుగు 8 (Bigg BossTelugu Season 8)లో వీరిద్దరూ చేసిన రచ్చ మామూలుది కాదు. ఆ సీజన్ కు సక్సెస్ కావడానికి వీరిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ, సరదా గొడవలు, భావోద్వేగ క్షణాలు అని చెప్పవచ్చు. వీరి తమ కంటెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి ఇంటర్వ్యూలకు జంటగానే వెళ్లడం, స్టేజ్ షోలలో కలిసి కనిపించడం వల్ల 'ఇది కేవలం ఫ్రెండ్షిప్ కాదేమో'అనే అనుమానాలు మరింత పెరిగాయి. అంతేకాదు, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 లో కూడా ఇద్దరూ కలిసి పాల్గొనడంతో లవ్ ట్రాక్‌పై చర్చ మరింత వేడెక్కింది.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్ శెట్టి ప్రముఖ టాక్ షో బిగ్ టీ కిస్సిక్ టాక్స్ ( Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ప్రోమోలో పృథ్వీ తన కెరీర్, బిగ్‌బాస్ అనుభవాలు, వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. ముఖ్యంగా విష్ణుప్రియతో తన రిలేషన్ గురించి పృథ్వీరాజ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఇంటర్వ్యూలో భాగంగా సంక్రాంతి పండుగ గురించి యాంకర్ వర్ష ప్రశ్నించగా.. పృథ్వీ సరదాగా "ఫెస్టివల్ అంటే వెజ్ ఉంటుంది కదా" అని ఫన్నీ రిప్లే ఇచ్చాడు. వెంటనే వర్ష 'అమ్మో విష్ణూ... మన పృథ్వికి సంక్రాంతి గురించి ఏమీ తెలియదు. ఈ సంక్రాంతికి పృథ్విని పిలిస్తే పండుగ ఎలా ఉంటుందో చూపిద్దాం'అని సెటైర్ వేసింది. దీనికి పృథ్వీ వెంటనే 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ స్పందించడంతో, వర్ష 'అయితే ఈ సంక్రాంతికి కొత్త అల్లుడు వస్తున్నాడన్నమాట' అంటూ ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఇలా సరదా సాగుతున్న ఇంటర్య్వూ మధ్యలోనే అనూహ్యంగా విష్ణుప్రియ పృథ్వీకి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన పృథ్వీ ముందుగా సరదాగా 'ఇంతకీ సంక్రాంతి ఎప్పుడు రా?' అని అడిగాడు. అయితే విష్ణుప్రియ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఒక్కసారిగా 'ఏంట్రా... నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ డైరెక్ట్‌గా ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా షాక్ అయిన పృథ్వీ 'ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను'అంటూ కాల్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడే విష్ణుప్రియ 'ఏంట్రా... నాతో మాట్లాడితే లవ్‌లో పడిపోతావని డౌట్ ఉందా?'అంటూ మరో సెటైర్ వేసింది. దీనికి పృథ్వీ 'అందుకే విష్ణుతో మాట్లాడితే నాకు టెన్షన్‌గా ఉంటుంది' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
ఫోన్ కాల్ ముగిసిన వెంటనే యాంకర్ వర్ష మరో కీలక ప్రశ్న వేసింది. 'ఇప్పుడే విష్ణుప్రియ ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు?'అని అడగ్గా, పృథ్వీ ఏమాత్రం తడబడకుండా 'వద్దమ్మా... నాకంటే మంచివాడిని చూసుకుని పెళ్లి చేసుకో అని చెబుతా. యాక్సెప్టెన్సీ ఉండాలి కానీ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు'అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మాటలతో పృథ్వీ-విష్ణుప్రియ మధ్య ప్రేమ సంబంధం లేదని, కేవలం మంచి స్నేహమే ఉందని మరోసారి స్పష్టమైంది.
ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు పృథ్వీ సమాధానాలు కాస్త హర్ట్‌ఫుల్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన నిజాయితీని, స్పష్టతను మెచ్చుకుంటున్నారు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్ సీజన్ 8లో మొదలైన విష్ణుప్రియ-పృథ్వీ లవ్ ట్రాక్‌కు ఈ ఇంటర్వ్యూ ద్వారా పూర్తిస్థాయి క్లారిటీ వచ్చినట్టే. ప్రేమ కాదని, స్నేహమేనని పృథ్వీ మరోసారి తేల్చి చెప్పడంతో ఈ అంశం ఇప్పుడు టీవీ, సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విష్ణుప్రియ స్పందన ఎలా ఉండబోతుందో? వీరి స్నేహం భవిష్యత్తులో ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











