Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బిగ్ బాస్2: జైలు తాళం ఎలా వేస్తారు, నిలదీసిన కౌశల్.. రోల్ రైడ ఖతర్నాక్ ఐడియా!
Recommended Video
బిగ్ బాస్2 షో ఫైనల్ దిశగా దూసుకుపోతోంది. ఈ వారం ముగిస్తే ఇక వచ్చే వారమే ఫైనల్. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఎవరికి వారు టైటిల్ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవారం హౌస్ లో తీవ్రంగా భావోద్వేగాలు చెలరేగాయి. కౌశల్ వెర్సస్ మిగిలిన ఇంటిసభ్యులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కౌశల్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విజేతగా ఎవరు నిలుస్తారో ఊహించలేని పరిస్థితి. తాజాగా ఫైనల్ లో ఎంట్రీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా మారింది. నేడు ప్రసారం చేసే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఉత్కంఠ తారాస్థాయికి
గత వారం రోజులుగా హౌస్ లో పరిణామాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కౌశల్ తో ఇంటి సభ్యులంతా తీవ్ర వాగ్వాదానికి దిగితున్నారు. ఇటీవల ఇచ్చిన ఇసుక టాస్క్ లో అయితే కౌశల్, తనీష్ శారీరక దాడులకు సైతం సిద్ద పడ్డారు. ఇది తీవ్ర వివాదంగా మారింది.
ఇంటి సభ్యులని కుక్కలుగా
కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో కౌశల్ కూడా ఆవేశాన్ని అణుచుకోలేక పోయాడు. ఇంటి సభ్యులంతా నాపై కుక్కల్లాగా దాడి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ రణరంగాన్ని తలపిస్తోంది. కౌశల్ అన్న మాటతో రోల్ రైడ గుక్కపెట్టి ఏడ్చేశాడు.
టార్గెట్ కౌశల్
కౌశల్ పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న ఇంటి సభ్యులు అతడిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్థం అవుతోంది. ఇసుక టాస్క్ లో తాము గెలవకపోయినా పరవాలేదు కాదు.. కౌశల్ గెలవకూడదని తనీష్, సామ్రాట్, రోల్ రైడ ఏకం అయిపోయిన సంగతి తెలిసిందే. తనీష్, సామ్రాట్ అండతో రోల్ రైడ ఇసుక టాస్క్ ఫస్ట్ లెవల్ లో విజయం సాధించాడు.
కోడి గుడ్ల టాస్క్
నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో బిగ్ బాస్ గోడి గుడ్ల టాస్క్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రోమోని తాజా విడుదల చేశారు. ఫినాలేకి అర్హత సాధించేందుకు ఇది లెవల్ 2 టాస్క్. ఈ టాస్క్ లో పోటీదారులు బిగ్ బాస్ కొన్ని కోడి గుడ్లని జాగ్రత్త పరుచుకోవాలి. మిగిలిన వాళ్ళు ఆ కోడి గుడ్లని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
జైలు తాళం
ఈ
టాస్క్
లో
కూడా
సామ్రాట్,
రోల్
రైడకు
తనీష్
అండగా
నిలుస్తునట్లు
తెలుస్తోంది.
వారిద్దరిని
జైలులో
ఉంచి
తాళం
వేశాడు.
ఇదేంటి
అంటూ
కౌశల్
నిలదీస్తున్నాడు.
దీనితో
ఈరోజు
కూడా
కౌశల్,
తనీష్
మధ్య
మాటల
యుద్ధం
తప్పేలా
లేదు.
రోల్ రైడ ఖతర్నాక్ ఐడియా
రోల్ రైడ మాత్రం తనకు కేటాయించిన కోడి గుడ్లని కాపాడుకునేందుకు ఖతర్నాక్ ఐడియా వేశాడు. కిచెన్ లోఎవరికీ కనిపించని విధంగా కోడి గుడ్లని దాచిపెడుతున్నాడు. కలర్ గ్లాస్ టాస్క్ లో కూడా రోల్ రైడ ఇదే విధంగా చేశాడు. ఏం జరగబోతోందో నేటి ఎపిసోడ్ లో చూద్దాం!