50 కోట్ల ప్రేక్షకులు.. 43800 నిమిషాలతో.. బిగ్‌బాస్ రేర్ రికార్డు

దేశంలోని టెలివిజన్ రంగంలో టాప్ మోస్ట్ వ్యూవర్ షిప్ ఉన్న రియాలిటీ ఏదంటే.. బిగ్‌బాస్ అని అందరూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతారు. వివిధ భాషల్లో ప్రసారమయ్యే ఈ పాపులర్ షోకు భారీ ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, కన్నడలో ఎన్నో సంవత్సరాలుగా ఈ షో ప్రసారం అవుతున్నది. అలాగే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో టాప్ షోగా రికార్డులు క్రియేట్ చేసింది.

ఇలాంటి షోకు సంబంధించిన తాజా , త్వరలోనే ప్రారంభం కానున్నది. బిగ్‌బాస్ తెలుగు 10, బిగ్‌బాస్ తమిళ 10, బిగ్‌బాస్ మలయాళంలో త్వరలోనే సీజన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్‌ను ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం బిగ్ బాస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

Bigg Boss record

బిగ్‌బాస్ రియాలిటీ షోల వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా, కన్నడలో సుదీప్ కిచ్చ హోస్ట్‌గా, తెలుగులో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా, తమిళంలో కమల్ హాసన్ తర్వాత విజయ్ సేతుపతి హోస్ట్‌గా, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్‌గా షోలో నిర్విరామంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు హోస్ట్ చేసిన ఎపిసోడ్స్‌లోని కొన్ని ముఖ్య సన్నివేశాలను రిలీజ్ చేశారు.

అంతేకాకుండా బిగ్‌బాస్ రియాలిటీ షో ఇక ముందు బెంగాళీ భాషలో ప్రసారం కానున్నది. ఈ షో కోసం ప్రముఖ క్రికెటర్ సౌరభ్ గంగూలీని రంగంలోకి దింపారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి హోస్ట్‌గా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నది. ఈ షో బెంగాలీ బుల్లితెర అభిమానుల్లో అంచనాలు పెంచేసిందనే విషయం తెలిసిందే.

ఇక భాష, మతాలకు సంబంధం లేకుండా, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ షోను డిజైన్ చేయడం వల్ల ప్రతీ ఇంటిలోని సభ్యులకు ఫేవరేట్‌గా మారింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 500 మిలియన్ల ప్రేక్షకులను సంపాదించుకొన్నది. అంతేకాకుండా 438 బిలియన్ నిమిషాల వీక్షణను రికార్డు చేసింది. 2025 లో ఈ షో 625 బ్రాండ్స్‌ను ఎంగేజ్ చేసింది అని నిర్వాహకులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలుగులో 10వ సీజన్‌గా బిగ్‌బాస్ త్వరలోనే ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ తొలి వారంలో గానీ, రెండో వారంలో గానీ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ వార్తను అధికారికంగా జియో హాట్ స్టార్ వెల్లడించనున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X