Bigg Boss Telugu 7: అమర్‌దీప్ అలాంటి వాడు.. తొలిసారి నోరు విప్పిన బిగ్‌బాస్‌.. ఈ వీడియో చూస్తే అంతా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్క్ లు ఇస్తూ.. అందరినీ విపరీతంగా అలరించిన ఈ షో మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ముఖ్యంగా వచ్చే ఆదివారమే విన్నర్ ఎవరో, రన్నరప్ ఎవరో తెలియబోతుంది. 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోకు ఇదే చివరి వారం కావడంతో అంతా ఆసక్తిగా ఈ షోను తిలకిస్తున్నారు. ఈ వారం రోజుల్లో కంటెస్టెంట్లు ఏమైనా తప్పులు చేస్తే.. విన్నర్, రన్నర్ లలో తేడాలు వస్తాయి కాబట్టి అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే తాజాగా 15వ వారంలో భాగంగా బిగ్ బాస్ ఓ షాకింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో అమర్ దీప్ అసలు క్యారెక్టర్ ఏంటి ఆయన ఏమేం చేశారో పూర్తిగా వివరించారు. ఒక్క వీడియోతో అమర్ దీప్ బిగ్ బాస్ కు వచ్చినప్పటి నుంచి ఏమేం చేశారో, ఎలా గేమ్ ఆడారో పూర్తిగా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బాస్ విడుదల చేసిన అమర్ దీప్ సక్సెస్ ఫుల్ జర్నీ వీడియోలో ఏముందో.. అమర్ దీప్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Released Amardeep Successfull Journey in Bigg Boss Telugu 7 Check Details

బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అమర్ దీప్ జర్నీ వీడియో ఉంది. ముందుగా.. మంచు కురుస్తున్నట్లుగా సెట్ చేసి గార్డెన్ ఏరియా అంతా అమర్ దీప్ కు సంబంధించిన ఫొటోలు పెట్టారు. అలాగే ఆయన ఆడిన టాస్క్ లకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా అందులో ఉంచారు. అమర్ దీప్ గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఫుల్ నవ్వుతూ వచ్చాడు. తనకు సంబంధించిన ఫొటోలను చూసుకుంటూ మురిసిపోయాడు. డ్యాన్స్ వేస్తూ మురిసిపోయాడు. అయితే బిగ్ బాస్ ముందుగా.. అమర్ దీప్ పేరుకు అర్థం చెప్పి మొదలు పెట్టారు. అమర్ దీప్ అంటే ఎప్పిటకీ వెలిగే జ్యోతి అని అదే మీ ప్రయాణంలో ప్రతిబింబించిందని చెప్పుకొచ్చారు.

ఎలాగైనా ప్రతీ ఆటలో గెలిచి చివరి వరకూ చేరాలని మీ తపన మీ ప్రయాణాన్ని అద్భుతంగా మలిచిందని బిగ్ బాస్ అన్నారు. ఇక ఆ తర్వాత తాను ఆడిన టాస్క్ ప్రాపర్టీలను చూసి.. కెప్టెన్ అవ్వాల్సిందంటూ బాధ పడ్డారు. అది కాగానే మీ చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని, మీ అల్లరిని, మీ వెటకారాన్ని మీ స్నేహితులకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న వాడిని నేను. అలాగే కట్టలు తెంచుకున్న మీ భావోద్వేగాలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఆపుకుంటూ వచ్చిన మీ స్నేహితులే మారారు అని అన్నారు. కెప్టెన్సీ పోయినప్పటి పొటోను చూస్తూ మరింత ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్.

Bigg Boss Released Amardeep Successfull Journey in Bigg Boss Telugu 7 Check Details

ఇక ఆ తర్వాత పొరపాట్లు చేయని వ్యక్తులు ఎవ్వరూ లేరు. కానీ ఆ పొరపాట్లను తెలుసుకుని ముందుకు వకదిలే వారిని ఎవ్వరూ ఆపలేరంటూ బిగ్ బాస్ చెప్పగా.. అమర్ దీప్ బిగ్ బాస్ కు కిస్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన జర్నీ వీడియో చూడడం.. అయిపోయిన వెంటనే టపాసులు పేల్చారు. ఈరోజు విడుదల అయిన ఈ ప్రోమో చూస్తుంటే అమర్ దీప్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ వీడియోను చూసేయచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X