Bigg Boss Telugu 7: సింపుల్ ప్రియాంక శివంగిలా మారిన తీరు చూపించిన బిగ్‌బాస్‌.. వీడియో మామూలుగా లేదుగా!

బిగ్ బాస్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఉర్రూతలూగిపోతున్నారు. నువ్వు ఓట్ వేశావా, ఎవరికి వేశావ్, నీ ఫేవరెట్ ఎవరు, టాప్ 5లో ఎవరు ఉంటారు, విన్నర్, రన్నరప్ లు ఎవరు అంటూనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం చివరి వారం కొనసాగుతోంది. మరో ఐదు రోజుల్లో విన్నర్ ను డిక్లేర్ చేసి ప్రైజ్ మనీ ఇచ్చేస్తారు. ఈక్రమంలోనే 15వ వారంలో భాగంగా హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్లకు సంబంధించిన జర్నీ వీడియోలను చూపిస్తున్నారు.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా అమర్ దీప్ వీడియో చూపించిన బిగ్ బాస్ ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంబటి అర్జున్ ను జర్నీని చూపించారు. కోపం, ప్రేమ, బాధ, నవ్వు.. ఇలా అన్నీ ఎమోషన్స్ ను సమ పాళ్లలో చూపిస్తూ.. ఫుల్ కిక్ ఇస్తున్నారు. అయితే ఈరోజుటి ఎపిసోడో శివాజితో పాటు ప్రియాంక జైన్ జర్నీ చూపించబోతున్నట్లు ప్రోమోలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఈరోజు ఉదయం విడుదల అయిన ప్రోమోలో శివాజి జర్నీ వీడియో చూపించిన బిగ్ బాస్... తాజాగా మరో ప్రోమోను వదిలారు. అందులో ప్రియాంక జైన్ సక్కెస్ ఫుల్ జర్నీ వీడియోను చూపించారు.

Bigg Boss Released Priyanka Jain Bigg Boss Telugu 7 Journey Video Check Details

ముందుగా ఫిదా సినిమాలోని హే పిల్లగాడా మ్యూజిక్ ప్లే చేయగా.. ప్రియాంక గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు సంబంధించిన ఫొటోలన్నీ చూసుకుని మురిసిపోయింది. అంతేకాకుండా ఫుల్ ఎమోషనల్ కూడా అయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ వాయిస్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రియాంక.. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారి ఎంచుకోవాలో మీకో స్పష్టత ఉందని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్.. ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభాశెట్టిల స్నేహాన్ని చూపించారు. ఇంటికి ఆయుపట్టులాంటి కిచెన్ కు ఉన్న శక్తి అర్థం చేసుకుని అక్కడి నుంచి మీ ఆటను కొనసాగించారని అన్నారు.

అలా చెప్పగానే.. యావర్ ప్లేట్ వదిలి వెళ్తుంటే ప్రియాంక జైన్ ఫుల్ ఫైర్ అయిన వీడియోను చూపించారు. అందరూ ఇక్కడ ఏదో సాధించడానికి వచ్చాం.. ఇక్కడ గిన్నెలు కడగడానికి ఎవరూ రాలేం అంటూ చెప్పింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ వాయిస్ రాగా... సింపుల్ ప్రియాంకగా ఉన్న మీరు శివంగి ప్రియాంకల మారి నామినేషన్స్ లో విరుచుకు పడ్డ తీరు అందరికీ అర్థం అయ్యేలా చేసిందని అన్నారు. అప్పుడు ప్రియాంక జైన్ ఫుల్ ఎమోషనల్ కాగా కన్నీళ్లు పెట్టుకుంది. ఐ యామ్ సోలో.. నేను సోలాగానే వచ్చా.. సోలోగానే ఆడి సోలోగానే వెళ్తా అంటూ గతంలో చెప్పిన డైలాగ్ ను చూపించారు.

Bigg Boss Released Priyanka Jain Bigg Boss Telugu 7 Journey Video Check Details

ఎవరు ఎన్ని మాటలు అన్నా... వాటి నుంచి తేరుకుని మీ లక్ష్యంపై దృష్టి పెట్టారు తప్ప ఆత్మ విశ్యాసాన్ని కోల్పోలేదని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు. ఇంత పవర్ ఫుల్ గా ప్రియాంక జైన్ జర్నీ వీడియో కనిపిస్తోంది. అయితే పూర్తి వీడియో చూడాలంటే మాత్రం ఈరోజు వచ్చే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ జర్నీ వీడియోలతో కూడా ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. మరి ఇదేమైనా ప్రియాంకకు హెల్ప్ అవుతుందా లేదా తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X