Bigg Boss Telugu 7: శివాజి ముందు అంతా ఓడినా పైచేయి సాధించింది అదేనట.. కన్ఫార్మ్ చేసిన బిగ్‌బాస్!
బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. అద్భుతమైన రెస్పాన్స్ తో ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటికే 14 వారులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా చివరి వారంలో అడుగు పెట్టింది. మరో ఐదు రోజుల్లో ఈ షో ఫైనల్స్ జరగనుండగా.. ఎవరు విన్నర్ గా నిలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రతీ సీజన్ లో ఫ్యామిలీ వీక్ వచ్చే సరికే ఎవరు విన్నర్ అవుతారనే దానిపై ఓ క్లారిటీ వచ్చేది. కానీ ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షో మాత్రం ఎవరూ ఊహించని విధంగా షాకిస్తోంది.
అయితే ఫ్యామిలీ వీక్ వరకు శివాజి విన్నర్ అవుతాడని.. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ రన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా అమర్ దీప్ గ్రాఫ్ పెరిగిపోయింది. ముఖ్యంగా 11, 12 వారాల్లో అమర్ దీప్ యే విన్నర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ 13వ వారంలో ఆయన చేసిన రచ్చతో మరింత కిందక వచ్చేశాడు. ఎప్పటిలాగే శివాజి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనుకోగా.. ఆయనకు కూడా నెగిటివిటీ వచ్చింది. ఇక పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ ఒకేలా ఉండడంతో... ఆయనే ఓటింగ్ లో ముందున్నారు. అయితే మొదటి వారమే హౌస్ లో కాలు పెట్టిన శివాజి.. ఇంటికి పెద్ద దిక్కులా మారారు.

ఆయనకు ఉన్న అనుభవంతో అద్భుతంగా గేమ్ ఆడుతూ.. అందరి మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా స్పా బ్యాచ్ కు చుక్కలు చూపిస్తూ.. ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడకుండా వచ్చారు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లతో నిజమైన బాండింగ్ ఏర్పరుచుకుని.. చేయి నొప్పి ఉన్నా ఫైనల్స్ వరకూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఎవరికీ భయపడలేదు. ఆయనను ఎదురించే మాట్లాడే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. నాగార్జునకే షాకిచ్చిన ఈయనపై ఒక్కటి మాత్రం పైచేయి సాధిస్తోందని బిగ్ బాస్ తెలిపారు. తాజాగా విడుదల అయిన ప్రోమోలో శివాజికి సంబంధించిన బిగ్ బాస్ జర్నీ వీడియోను చూపించారు.
ముందుగా అందంగా ముస్తాబై గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజికి బిగ్ బాస్ వెల్ కమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజి తన 25 ఏళ్ల ఇండస్ట్రీ ఒకెత్తు అయితే బిగ్ బాస్ జర్నీ తనకు ఒకెత్తు అని శివాజి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ వాయిస్ ప్రారంభం అయింది. శివాజి మిమ్మల్ని ఒకవేలు ఎత్తి చూపిస్తే.. మిగతా నాలుగు వేళ్లు వాళ్లనే వైపే ఉండేవా చేయగల మాటకారి మీరు అంటూ తెలిపారు. ఆ తర్వాత రాజుగారి పెద్ద పెళ్లాం మంచిది అంటే చిన్నది మంచిది కాదంటూ గతంలో ఆయన కొట్టిన డైలాగ్ ను చూపించారు. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించిన ఓటమి వైపు చూడలేదని అన్నారు.

మీ అబ్బాయే మీ డాక్టర్ గా వచ్చినప్పుడు మీరు మీ బాధను అంతా మరిచిపోయారు అంటూ బిగ్ బాస్ చెబుతుంటే శివాజి ఎమోషనల్ అయ్యాడు. సైరన సమయంలో సరైన పావులు కదిపి.. చాణక్యుడిగా నిలిచారంటూ పొగడ్తల వర్షఁ కురిపించారు. ఈ పూర్తి సీజన్ లో మీమీద పైచేయి సాధించిన ఒకే ఒక్కటి కాఫీ పొడి అని తెలిపారు. దానిపై మీకు ఉన్న ఇష్టం మీమీద పైచేయి సాధించిందని అన్నారు. కంటెస్టెంట్ గా నిలిచి కన్ఫర్మేషన్ కొట్టి హౌస్ మేట్ గా నిలిచారంటూ తెలిపారు బిగ్ బాస్. మీ ఆట తీరే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పి ప్రోమోను ముగించేశారు. శివాజికి సంబంధించిన పూర్తి జర్నీ వీడియో చూడాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











