Bigg Boss Non Stop: అనిల్ రాథోడ్‌కు బిగ్ బాస్ షాక్.. వారం మధ్యలోనే ఔట్.. షో చరిత్రలో ఇదే తొలిసారి

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల కొట్లాటలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన ప్రయాణమే బిగ్ బాస్ షో. అందుకే ఇది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఫలితంగా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సాధిస్తూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది.

ఇక, తాజాగా ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటి కెప్టెన్ అయిన అనిల్ రాథోడ్‌కు బిగ్ బాస్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇలా షో చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వంద శాతం వినోదాన్ని ఇచ్చేలా

వంద శాతం వినోదాన్ని ఇచ్చేలా

రెగ్యూలర్ బిగ్ బాస్ షో రోజంతా రికార్డు చేసి కేవలం గంటసేపు మాత్రమే ప్రసారం చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను ప్రారంభించి దీన్ని రోజంతా స్ట్రీమింగ్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది ఒకరోజు ఆలస్యంగా రన్ అవుతోంది. ఈ సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సీజన్ మొత్తం 84 రోజుల పాటు వంద శాతం వినోదం ఇవ్వబోతుంది.

17 మందిలో ఇద్దరు ఎలిమినేట్

17 మందిలో ఇద్దరు ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

మూడో వారం రంజుగా మార్చేలా

మూడో వారం రంజుగా మార్చేలా

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. దీన్ని ప్రతివారం సరికొత్త టాస్కులతో మరింత రంజుగా మార్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం ఏకంగా 12 మందిని నామినేట్ చేశారు. అలాగే, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడం కోసం ‘మీ ఇష్టం' అనే టాస్క్‌ను ఇచ్చారు. అలాగే, యాంకర్ శివకు సీక్రెట్‌ టాస్కును ఇచ్చారు.

అబద్ధాలతో పొగడాలంటూ టాస్క్

అబద్ధాలతో పొగడాలంటూ టాస్క్

బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ యూనిట్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా ఒక కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్‌ను అబద్ధాలతో పొగుడుతూ ఉండాలి. అలా అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ నవ్వించాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అందుకు అనుగుణంగానే కంటెస్టెంట్లు నవ్వించారు.

అనిల్ రాథోడ్‌కు బిగ్ బాస్ ప్రశ్న

అనిల్ రాథోడ్‌కు బిగ్ బాస్ ప్రశ్న

ఈ వారానికి సంబంధించిన బిగ్ బాస్ ఇంటికి అనిల్ రాథోడ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక, అతడితో మాట్లాడిన బిగ్ బాస్ ‘అనిల్.. ఈ వారం మీ కెప్టెన్సీ ఎలా సాగుతుంది' అని సూటిగా ప్రశ్నంచాడు. దీనికతడు ‘బాగుంది బిగ్ బాస్. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అసలు ఎందుకిలా అడిగాడని అంతా అవాక్కయ్యారు.

వాళ్లకు ప్రశ్న... తప్పులు చూపి

ఇక, అనిల్ రాథోడ్ కెప్టెన్సీకి సంబంధించి అతడి ప్రదర్శన ఎలా ఉందని కంటెస్టెంట్లను కూడా ప్రశ్నించాడు బిగ్ బాస్. దీనికి చాలా మంది మంచిగానే చేస్తున్నాడని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఈ వారం అనిల్ కెప్టెన్సీలో జరిగిన తప్పులను చూపించాడు. అందులో కొందరు నిద్రపోతూ కనిపించగా.. మరికొందరు మాత్రం మైక్ లేకుండా ఉండడాన్ని చూపించారు.

Recommended Video

Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
వారం మధ్యలోనే అనిల్ అవుట్

వారం మధ్యలోనే అనిల్ అవుట్

ఈ వారం మొత్తం మీద చాలా మంది కంటెస్టెంట్లు నిద్రపోవడం, మైక్‌లు ధరించకపోవడం వంటి పొరపాట్లు చేశారు. దీంతో బిగ్ బాస్ కెప్టెన్ అనిల్ రాథోడ్‌పై వేటు వేశాడు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. అంతేకాదు, అతడి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను వెంటనే తొలగించి స్టోర్ రూమ్‌లో పెట్టించారు. ఇలా జరగడం షో చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X