Bigg Boss Telugu 7:ఇది కదా అసలైన ఉల్టా పుల్టా..ప్రశాంత్‌కి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చిన బిగ్‌బాస్‌..కానీ ఓ ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఐదో వారంలో అసలైన ఉల్టా పుల్టా ఇదే అంటూ నాగార్జున ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ వారం మరో అసలైన ఉల్టా పుల్టా జరిగింది. పల్లవి ప్రశాంత్ సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడం లేదని... బిగ్ బాస్ షాక్ ఇస్తూ ఆయన క్యాప్టెన్సీ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి ప్రేక్షకులకు షాక్ ఇస్తూ... ప్రశాంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.. అదేంటో ఓసారి ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ సీజన్ లో ఎన్నో ఉల్టా పుల్టాలు చూస్తునే ఉన్నాం. అయితే ఐదో వారంలో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో అసలైన ఉల్టా పుల్టా అంటూ నాగార్జున చెప్పుకువచ్చాడు. ఇక ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరో ఉల్టా పుల్డా హౌజ్ లో జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్... పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్ కూడా చాలా బాధపడ్డాడు.

Bigg Boss returned the captaincy batch to Raithu Bidda Pallavi Prashanth in Bigg Boss Telugu 7 Show

ఇక హౌజ్ లోని మెంబర్స్ అంతా... పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా వ్యవహారించడం లేదంటూ చెప్పుకువచ్చారు. అందరూ ప్రశాంత్ కు వెన్నుపోటు పొడిచారు. ఇక అమర్ దీప్ అయితే... చాలా అమాయికంగా ఫేస్ పెట్టి... ప్రశాంత్ గురించి మాట్లాడాడు. ఇక హౌజ్ లో ప్రశాంత్ మంచి కెప్టెన్ అన్న వాళ్లు చేతులు ఎత్తండి అంటే మాత్రం.. చాలా వరకు ఎత్తారు కానీ.. అమర్ దీప్ మాత్రం ఎత్తలేదు. మొదటి నుంచి ప్రశాంత్ పై అమర్ దీప్ కు కోపమైతే ఉంది.

ఆ విషయం పక్కన పెడితే... బిగ్ బాస్ హౌజ్ లో ఓ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... హౌజ్ లో మొదటి కెప్టెన్సీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రైతు బిడ్డ మొదట్లో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నప్పటికీ... ఇప్పుడిప్పుడే హౌజ్ లో తనదైన శైలిలో ఆడి... ప్రేక్షకుల మదిని గెలుచుకుంటున్నాడు. ఇక నిన్న కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ప్రశాంత్ చాలా బాధ పడ్డాడు. ఆఖరికి శివన్నా కూడా వాడి కోసం నేను చాలా కష్టపడ్డాను... వాడు కెప్టెన్ అవ్వాలని అని ఆవేదన చెందాడు.

Bigg Boss returned the captaincy batch to Raithu Bidda Pallavi Prashanth in Bigg Boss Telugu 7 Show

ఇక యావర్, ప్రశాంత్ కూడా చాలానే డిస్కర్షన్ పెట్టారు. ప్రశాంత్ కెప్టెన్సీ పోవడంపై ఏడ్చాడు. ఇక ఇంట్లో వాళ్లంతా బ్యాడ్జ్ మాత్రమే పోయింది నువ్వే మా క్యాప్టెన్ అంటూ దైర్యాన్ని ఇచ్చారు. నిన్న కాసేపు యావర్ నిద్రపోతే కుక్కలు మొరిగాయి. అది చూసిన సందీప్... నువ్వు వాడికి పనిష్మెంట్ ఇవ్వు... తేజ నిద్రపోతనే నీ కెప్టెన్సీ వెనక్కి తీసుకున్నాడు... ఇప్పుడు యావర్ పడుకున్నాడు అంటూ చెప్పుకువచ్చాడు. దానికి ప్రశాంత్.. నేను కెప్టెన్ కాదు.. నేను ఎందుకు ఇస్తాను అంటూ చెప్పుకు వచ్చాడు.

ఇక ఆ విషయం పక్కన బెడితే... బిగ్ బాస్ మళ్లీ ట్విస్టు ఇస్తూ.. ప్రశాంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేశాడు. అసలు ఆయన ఎందుకు తీసుకున్నాడు.. ఎందుకు ఇచ్చాడు అనేది మీ డౌట్ కదా.. ప్రశాంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు తెలియాలని.. కంటెస్టెంట్స్ చేత చెప్పించాలని అనుకున్నారట. అందుకే ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అసలే ఇది ఉల్టా పుల్టా సీజన్ కదా.. అందుకే ప్రశాంత్ కు అలా ఝలక్ ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తానికి ప్రశాంత్ మళ్లీ కెప్టెన్ అయిపోయాడు. మళ్లీ ఈసారి అయినా.. ఆయన కరెక్ట్ గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడా లేదా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X