Adireddy: లక్షలున్నా చెల్లికి ఆపరేషన్ చేయించలే, పెళ్లి కూడా చేయలే.. కారణాలు చెప్పిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ఇక ఈ సీజన్ ప్రారంభం అవ్వబోతుంది అని తెలిస్తే మరింత ఆతృతగా, ఆసక్తిగా టీవీలకు వాలిపోతుంటారు. అంతేనా అందులో పాల్గొనే కంటెస్టెంట్లు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి వారు సంపాదన, వారి కుటుంబం గురించి ఆరాలు తీస్తారు. అన్నీ తెలుసుకుని మరీ వారికి సపోర్ట్ చేస్తూ నచ్చిన కంటెస్టెంట్ ను గెలిపించుకుంటారు. మొదట్లో ఇలా చేస్తూనే ఆ తర్వాత రీవ్యూయర్ గా మారాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా వెళ్లాడు. వచ్చిన తర్వాత మళ్లీ రీవ్యూలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆదిరెడ్డి.. చెల్లికి మాత్రం పెళ్లి చేయలేడు. కనీసం కంటి ఆపరేషన్ కూడా చేయలేదు. అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కు వెళ్లి అద్భుతమైన ఆట కనబర్చాడు. టాస్క్ లు ఆడుతూనే.. నిజాయితీగా ఉంటూ టాప్ 5 వరకు వచ్చాడు. ఎవరూ ఊహించని స్థాయిలో ఒక కామన్ మాన్ టాప్ 5కి రావడం అదే తొలిసారి. గత సీజన్లలో ఇలాంటిది ఒక్కసారి కూడా జరగలేదు. కానీ ఆదిరెడ్డికి మాత్రం అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన గురించే కాకుండా ఆయన కుటుంబ గురించి కూడా అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మికి కళ్లు కనిపించవు. ఆమె బిగ్ బాస్ స్టేజీపైకి కూడా వచ్చింది. తెగ సందడి చేసింది.

Bigg Boss Reviewer Adi Reddy Shocking Comments on His Sister Naga laxmi

ఇలా అందరికీ తెలిసిన ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి, భార్య కవితకు కూడా ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఓవైపు ఆదిరెడ్డి, మరోవైపు నాగలక్ష్మీ, కవితలు కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని బాగానే డబ్బులు సంపాధించుకుంటున్నారు. కేవలం బిగ్ బాస్ రీవ్యూలు చేస్తూనే మూడు నెలల్లో 39 లక్షలు సంపాధించిన ఆదిరెడ్డి.. ఇప్పటికీ చెల్లి పెళ్లి చేయలేదు. కనీసం ఆమె కంటికి ఆపరేషన్ కూడా చేయించలేదు. అయితే తాజాగా ఆదిరెడ్డి ఓ ఇంటర్య్వూలో పాల్గొనగా.. ఇదే ప్రశ్న ఆదిరెడ్డికి ఎదురైంది.

దీనిపై స్పందించిన ఆదిరెడ్డి... తన చెల్లెలు నాగలక్ష్మికి కంటి సమస్య ఉన్న మాట వాస్తవం అని కానీ ఆమెకు కను గుడ్ల బాగానే ఉన్న నరాలు సరిగ్గా లేవని చెప్పుకొచ్చాడు. నరాలు సరిగ్గా లేకే ఆమెకు కళ్లు కనిపించట్లేదని.. ఇప్పుడు ఆపరేషన్ చేయించి కనుగుడ్లు మార్పించినా కళ్లు కనిపించవని వివరించారు. ఆమెకు ఒకే ఒక కన్ను ఐదు శాతం మాత్రమే కనిపిస్తుందని.. కానీ ఓ ఇంట్లో పది నిమిషాలు ఆమె తిరిగితే అన్నీ గుర్తు పెట్టుకుని కాన్ఫిడెంట్ గా నడుస్తుందని చెప్పుకొచ్చారు. కళ్లు కనిపించక తాను చాలా ఇబ్బంది పడుతుందని.. కానీ తన భార్య కవితే దగ్గరుండి అన్నీ చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు.

Bigg Boss Reviewer Adi Reddy Shocking Comments on His Sister Naga laxmi

అలాంటి అమ్మాయికి పెళ్లి చేస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. అందుకే పెళ్లి చేయలేదని ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చాడు. యూట్యూబ్ వల్లే తాను చాలా సమస్యలు అధిగమించగల్గానని.. ముఖ్యంగా బిగ్ బాస్ షో వల్లే తనకు ఇదంతా సాధ్యం అయిందని తన సబ్ స్క్రైబర్ల అండా దండల వల్లే తాను ఇదంతా సాధించగల్గుతున్నానని స్పష్టం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X