సీక్రెట్ పెళ్లి.. ఏడాది సహజీవనం.. బ్రేకప్ పై రీతూ చౌదరి క్లారిటీ

సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రీతూ చౌదరి (Ritu Chowdary). బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్‌తో ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా గడుపుతోంది. గతంలో రీతూ చౌదరి, శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, అతడితో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించి అప్పట్లో వార్తల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వారి సంబంధం ముగిసింది. కొంతకాలం తర్వాత ఈ బ్రేకప్ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు ఆ విషయం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో రీతూ చౌదరి ఏమన్నారు?

బిగ్ బాస్ తర్వాత రీతూ పేరు మారుమోగుతోంది. ఆమెపై వచ్చిన కొత్త డేటింగ్ రూమర్స్. ముఖ్యంగా డిమాన్ పవన్ తో ఆమె రిలేషన్‌లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై రీతూ నేరుగా ఎప్పుడూ స్పందించకపోయినా, ఇద్దరూ కలిసి తరచూ కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్యాగ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం వల్ల ఈ ప్రచారం మరింత బలపడింది. ఇటీవల ఆమె పెట్టే స్టోరీలు చూస్తే.. ఆమె వ్యక్తిగత జీవితంలో ఏదో కీలక పరిణామాలు జరిగినట్టు సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అలాగే.. రీతూ వ్యక్తిగత జీవితం, ప్రేమ, బ్రేకప్‌లపై మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

Bigg Boss Rithu Chowdary on Secret Marriage Rumours Live-in Relationship amp amp Breakup Truth

ఇదిలా ఉంటే.. రీతూ చౌదరికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా "సీక్రెట్ పెళ్లి" అంటూ వచ్చిన వార్తలపై ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన రీతూ... 'అది నిజంగా పెళ్లి కాదు. మేము వాస్తవానికి ఏడాది పాటు లివింగ్ రిలేషన్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా బంధం చాలా అన్యోన్యంగా సాగింది' అని వెల్లడించింది.

అయితే, కాలక్రమంలో తమ మధ్య అర్థం పడకపోవడం, వ్యక్తిగత అభిప్రాయాలు కలవకపోవడం వంటి కారణాలతో ఆ రిలేషన్ ముందుకు సాగలేదని తెలిపింది. 'ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రభావం గానీ, నా మనస్తత్వం గానీ... ఏదో కారణంతో మా రిలేషన్ సెట్ కాలేదు. అందుకే నిర్ణయం తీసుకున్న ఆరు నెలల్లోనే మేము విడిపోయాం' అని చెప్పింది. ఇక ఆ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆ బంధాన్ని గానీ, ఆ పెళ్లిని గానీ నేను పరిగణలోకి తీసుకోను. అది పెళ్లి కాదు అని నేను భావిస్తున్నాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇద్దరికీ పెళ్లి అయినట్లు ఫోటోలు బయటకు వచ్చాయనే ప్రశ్నకు రీతూ కొంత గట్టిగానే స్పందించింది. 'అది నా పర్సనల్ విషయం. దాన్ని ఎవరికీ వివరించాలని నేను అనుకోవడం లేదు' అని చెప్పింది. అదే సమయంలో, 'పర్సనల్ అయితే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారు?' అన్న ప్రశ్నకు మరింత క్లారిటీ ఇస్తూ... 'ఆ ఫోటోలను నేను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అవి ఎవరు బయట పెట్టారో కూడా నాకు తెలియదు. నిజానికి ఆ ఫోటోలు నా దగ్గర కూడా లేవు. ఇప్పటివరకు నాకు కూడా అవి రాలేదు' అంటూ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ నెట్టింట ట్రెండ్ అవుతోంది. రీతూ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా 'అది పెళ్లి కాదు' అన్న మాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలా రీతూ చౌదరి వ్యక్తిగత జీవితం గురించి మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. లివింగ్ రిలేషన్, బ్రేకప్, సీక్రెట్ పెళ్లి రూమర్స్ అన్ని కలిపి ఈ ఇంటర్వ్యూను మళ్లీ వైరల్ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: bigg boss rithu chowdary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X