తనూజ-కళ్యాణ్ రిలేషన్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్.. అలా బిహేవ్ చేసే వాళ్లంటూ..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి రీతు చౌదరి మరోసారి వార్తల్లో నిలిచారు. పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన రీతు, ఆ తర్వాత కామెడీ షో జబర్దస్త్ ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. కెరీర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్న ఆమె, సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఆదరణ పొందుతున్నారు. ఈ క్రేజ్‌తోనే ఆమె బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

బిగ్ బాస్ సీజన్ 9లో దాదాపు 12 వారాల పాటు హౌస్‌లో కొనసాగిన రీతు చౌదరి, ఆ తర్వాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె వరుసగా బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని, బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన పలు అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య రిలేషన్‌పై ఆమె ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Bigg Boss Ritu Choudary Reveals Shocking Truths About Tanuja Puttaswamy Kalyan Padala

షోలో యాంకర్ వర్ష, 'బిగ్ బాస్ నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత డీమన్ పవన్ తనూజతో మాట్లాడుతూ 'రీతు లేదు కాబట్టి నిన్ను వదిలేశాను, లేకపోతే ఇంకోలా ఉండేది' అని అన్నాడు' అని ప్రస్తావించగా, రీతు దీనిపై స్పందిస్తూ అసలు ఉద్దేశాన్ని వివరించారు. 'రీతు లేకపోయేసరికి నువ్వు బతికిపోయావు అన్న అర్థంలోనే అతడు అన్నాడు. నిజానికి నేను హౌస్‌లో ఉన్నప్పుడు తనూజను ఎవరైనా ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చేదాన్ని కాదు. నేను లేనప్పుడు పవన్ కాస్త వెటకారంగా మాట్లాడేవాడు. ఆ విషయం గమనించిన వెంటనే నేను సరిదిద్దేదాన్ని'అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక తనూజ - కళ్యాణ్ రిలేషన్ గురించి మాట్లాడుతూ రీతు మరింత షాకింగ్ విషయాలు వెల్లడించారు. 'కళ్యాణ్ నన్ను ఏదైనా అనగానే తనూజ వెంటనే అడ్డుపడి అతడిని తిట్టేది. కానీ కొన్ని సందర్భాల్లో తనూజ లేనప్పుడు కళ్యాణ్ నన్ను కొట్టేవాడు కూడా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తనూజ ప్రవర్తనపై మాట్లాడుతూ, 'కొన్ని సందర్భాల్లో ఆమె టీచర్‌లా బిహేవ్ చేసేది. అందరినీ కంట్రోల్‌లో, క్రమశిక్షణలో పెట్టాలనే ఆలోచన ఆమెకు ఉండేది. మొదటినుంచే తనూజ, కళ్యాణ్ మధ్య ఇలాంటి ర్యాంపు కొనసాగింది'అని చెప్పారు.

అయితే ఈ విషయాలన్నీ షోలో సరిగ్గా చూపించలేదని రీతు అభిప్రాయపడ్డారు. 'బయటకు వచ్చిన తర్వాత పాత ఎపిసోడ్లు చూసినప్పుడు అసలు విషయం నాకు అర్థమైంది. వాస్తవానికి తనూజ, కళ్యాణ్ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. కానీ ఆ క్లారిటీని ఎక్కడా స్పష్టంగా చూపించలేదు. చివరి రెండు వారాల్లో ఏదో చూపించినట్టు చూపించారు' అంటూ రీతు షాకింగ్ కామెంట్ చేశారు.

ఇక తన గేమ్ జర్నీ గురించి మాట్లాడుతూ, 'నన్ను నేను మొదటి నుంచే టాప్ ఫైవ్‌లో ఉంటానని నమ్మకం పెట్టుకున్నాను. ఆ విషయంలో చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఎప్పుడూ నా క్యారెక్టర్ మార్చుకోలేదు. బయట ఎలా ఉన్నానో, హౌస్‌లో కూడా అలాగే ఉన్నాను. నా క్యారెక్టర్ నచ్చితే జనాలు ఓటు వేస్తారు, లేకపోతే పంపిస్తారు అన్న ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌తోనే ఆడాను' అని చెప్పారు.

ప్రతి టాస్క్‌లో ముందుండేందుకు ప్రయత్నించేదాన్నని, గేమ్ గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఆడాలనే ధైర్యమే ముఖ్యమని రీతు అభిప్రాయపడ్డారు. 'ఆ గేమ్ మనకు పూర్తిగా వచ్చా లేదా అనేది కాదు, ఆడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకే ఎక్కడా తగ్గేదెలా వ్యవహరించలేదు' అంటూ తన బిగ్ బాస్ జర్నీపై ఓపెన్‌గా మాట్లాడారు.

ఇలా కిస్సిక్ టాక్స్ వేదికగా రీతు చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు బిగ్ బాస్ సీజన్ 9లోని అనేక అనుమానాలకు సమాధానాలిచ్చినట్టయ్యాయి. ఆమె చేసిన షాకింగ్ రివిలేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మరోసారి బిగ్ బాస్ చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X