డిమాన్ పవన్ స్నేహితుడా? కాబోయే భర్తనా? క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి

రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బుల్లితెరపై పలు కార్యక్రమాలు, సీరియల్స్ ల్లో కనిపిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ముఖ్యంగా తన తోటి కంటెస్టెంట్ డిమాన్ పవన్ తో ప్రేమాయణం సాగిస్తూ.. ఆ షోలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండే రీతూ చౌదరి, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న రీతూ చౌదరి, తనుజ పుట్టస్వామి కలిసి తాజాగా 'కాకమ్మ కథలు' టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనుజ పుట్టస్వామితో కలిసి సందడి చేసిన రీతూ, తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, కెరీర్, కుటుంబం గురించి మాట్లాడింది. షోలో భాగంగా యాంకర్ తేజస్వి అడిగిన రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు రీతూ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. "లవర్ బాయ్ అంటే నీకు ఎవరు గుర్తుకొస్తారు?" అని ప్రశ్నించగా, "లవర్ బాయ్స్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. వాళ్లు అందరితోనూ తిరుగుతారు. ఎవ్వరినీ సీరియస్‌గా తీసుకోరు" అంటు షాకింగ్ కామెంట్స్ చేసింది.

Bigg boss Ritu Chowdary Opens Up About Demon Pawan Fans Curious About Their Bond

ఆ తర్వాత యాంకర్ కొన్ని ఫోటోలు చూపిస్తూ సరదా గేమ్ నిర్వహించింది. ఈ క్రమంలో తనుజకు బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రశ్న వేయగా ఆమె సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. వెంటనే అదే ప్రశ్నను రీతూ చౌదరిని అడగాలని కోరింది. దీంతో రీతూ, 'ఆల్రెడీ యూజ్ చేసిన వర్డ్స్‌ను నేను అస్సలు యూజ్ చేయను'అంటూ చెప్పింది. దీంతో వెంటనే బీప్ సౌండ్ రావడం అందరినీ నవ్వించింది. వెంటనే తనుజ, యాంకర్ తేజస్వి కలిసి రీతూను ఆట పట్టించారు.

ఇక షోలో భాగంగా పవన్ ఫోటోను చూపించగానే రీతూ కొంచెం సిగ్గుపడుతూ పిల్లోతో ముఖం దాచుకుంది. ఈ సందర్భంగా యాంకర్ 'ఇది దేవుడు రాసిన రాత'అని సరదాగా కామెంట్స్ చేసింది. వెంటనే స్పందించిన రీతూ 'అవును.. దేవుడు రాసిన రాతను అసలు మార్చలేం' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా పవన్‌తో జరిగిన కొన్ని సరదా సంఘటనలను కూడా గుర్తు చేసుకుంది. "ఒకసారి పవన్ నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం' అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇక తన సినీ,టెలివిజన్ ప్రయాణం గురించి కూడా రీతూ మాట్లాడింది. 'ఇండస్ట్రీలోకి రావడం నా కల. నన్ను టీవీలో చూడాలని కోరుకోవడం మా అమ్మ కోరిక'అని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో యాంకరింగ్, యాక్టింగ్ అవకాశాల పేరుతో వచ్చిన ప్రకటనలను నమ్మి ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చానని, కానీ అతడు మోసం చేశాడని వెల్లడించింది. అయితే ఆ సమయంలో తన తండ్రి తనకు అండగా నిలిచారని చెప్పింది.

ఈ సందర్భంగా తండ్రి గురించి మాట్లాడుతూనే రీతూ భావోద్వేగానికి గురైంది. 'ప్రతి ఒక్కరికీ మా నాన్న లాంటి నాన్న ఉంటే వాళ్ల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది' అని చెప్పింది. దానికి యాంకర్ తేజస్వి సరదాగా ' నాన్నగారు నన్ను కూడా అడాప్ట్ చేసుకోండి'అని అనగా, రీతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. 'మా నాన్నగారు ఇప్పుడు లేరు' అని చెప్పడంతో అక్కడ ఎమోషనల్ వాతావరణం నెలకొంది. వెంటనే తేజస్వి కూడా క్షమాపణ చెబుతూ ఆమెను ఓదార్చింది.

షో చివర్లో జరిగిన రాపిడ్ ఫైర్ రౌండ్‌లో "లవర్ బాయ్ ఎవరు?" అని అడగగా రీతూ వెంటనే "కళ్యాణ్" అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పవన్ గురించి కూడా ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "ఇంతకీ నీకు పవన్‌కు మధ్య ఉన్న బంధం ఏంటి? అతను నీ లవరా? ఫ్రెండా? లేక ఫ్యూచర్ హస్బెండా?" అని యాంకర్ ప్రశ్నించగా, రీతూ కొంచెం సిగ్గుపడుతూ "ఐ లవ్ టూ..." అంటూ మధ్యలోనే ఆపేసి సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇక చివరగా తాను ఇటీవల జాతకం చూపించుకున్నానని చెబుతూ, "ముందే చెబుతున్నా.. మీ ఓట్లన్నీ నాకు వేయాలి" అంటూ సరదాగా కామెంట్ చేసింది. రీతూ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: ritu chowdary pawan bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X