డైరెక్టర్ చెప్పినట్టే చేశా.. క్షమించండి.. తెలియకుండానే అలా.. కన్నీళ్లు పెట్టుకున్న సరయు?

యూట్యూబ్‌ పాపులర్‌ యాక్టర్ సరయుని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందూ మతం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో చేశారు అనే కారణంగా ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే ఈ విషయం మీద సరయు ఎట్టకేలకు స్పందించింది. ఆ వివరాలు

బోల్డ్ కంటెంట్ పేరుతో

బోల్డ్ కంటెంట్ పేరుతో

సరయూ ఒక సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఆమె ‘'7 ఆర్ట్స్‌'' యూట్యూబ్‌ ఛానల్‌ లో బూతులు వీడియోలు చేసి దానికి బోల్డ్ కంటెంట్ అనే పేరు పెట్టి జనాల్లోకి వదిలి ఫెమస్ అయింది. అయితే ఈ ఛానల్ లో కాస్త డబ్బు వచ్చాక హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అది బాగా వర్కౌట్ కావడంతో సిరిసిల్లలో కూడా మరో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఆ రెస్టారెంట్‌' ప్రమోషన్ కోసం ఒక షార్ట్ ఫిలిం చేసి గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఆ షార్ట్ ఫిలింలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మద్యం తాగుతున్న వీడియోను చూపించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్‌కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్‌ అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు

నటిని మాత్రమే

నటిని మాత్రమే

ఇక విచారణ చేపట్టిన సిరిసిల్ల పోలీసులు బంజారాహిల్స్‌ పరిధిలోని ఫిలింనగర్‌లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్​ సరయూను బంజారాహిల్స్​ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారని వార్తలు వచ్చాయి. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో తాను ఒక నటిని మాత్రమేనని అందులో వీడియో పెట్టే హక్కు గాని దానిని ఎడిట్ చేసి హక్కు గాని తనకు లేవు అని సరయు చెప్పుకొచ్చింది.

మరోసారి కేసు తెర మీదకు

మరోసారి కేసు తెర మీదకు

సెవెన్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎలా చెబితే తాను అలా చేశాను అని సరయు వెల్లడించింది. నిజానికి గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఈ పాట విడుదల చేశామని, ఆ సమయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ వారు సంప్రదించగా వారికి అభ్యంతరాలు ఉన్న బిట్ కట్ చేసి రిలీజ్ చేశామని ఆమె వెల్లడించింది. అయితే ఏమైందో ఏమో సంవత్సరం తర్వాత మరోసారి ఈ కేసు తెర మీదకు వచ్చినట్లు తెలిసి, ఆ విషయం కనుక్కోవడానికి తామే స్వయంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను అని ఆమె వెల్లడించింది.

Recommended Video

Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
పోస్ట్ పెట్టడంతో

పోస్ట్ పెట్టడంతో

తనను అరెస్టు చేయడం నిజం కాదని పేర్కొన్న ఆమె తాను ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తిని అని, ఎక్కడో హిందూ పూజారులను చంపినట్టు తనకు తెలియడంతో ఆ పోస్ట్ పెట్టడంతో త తన ఫేస్ బుక్ పేజ్ కూడా కోల్పోయానని చెప్పుకొచ్చింది. తాను ఒక హిందూ మహిళని అయినప్పుడు మరో హిందూ మనస్తత్వాన్ని ఎందుకు కించపరిచే విధంగా చేస్తాను అని ప్రశ్నించింది. ఈ విషయం మీద ఎవరి మనోభావాలు అయినా నొప్పించి ఉంటే క్షమించాలని ఆమె కోరింది. అయితే ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళ వెంట నీరు కూడా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X