వివాదాలు, అనుమానాలు.. కానీ ఊహించనిరీతిలో రికార్డు.. నాగార్జున ట్వీట్

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఆదివారం రోజు ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించుతూ నాగార్జున ఈ షోను ప్రారంభించారు. మొదటి రెండు సీజన్లకు వరుసగా ఎన్టీఆర్, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. మూడో సీజన్ లో ఆ బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు.

అయితే ఈ షో ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న వివాదాలు.. అసలు షో ప్రారంభమవుతుందా? లేదా అనే అనుమానాలకు తావిచ్చాయి. బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు, నాగార్జున ఇంటి ముందు ఓయూ విద్యార్థుల ఆందోళనలు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు, కోర్టు కేసు అన్నీ ఈ షోను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇష్యుపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది జనాల్లో. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా లాంచ్ చేశారు హోస్ట్ నాగార్జున. 15 మంది పార్టిసిపెంట్స్‌ని పరిచయం చేసి బిగ్ బాస్ జోస్ లోకి పంపించారు.

Bigg Boss Season 3 Created a record


కాగా వివాదాల నడుమనే బిగ్ బాస్ సీజన్ 3 స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. నిన్న రాత్రి 'బిగ్‌ బాస్‌ తెలుగు 3' హ్యాష్‌ ట్యాగ్ సోష‌ల్ మీడియాలో మారు మోగింది. ఈ హాష్ ట్యాగ్ ద్వారా బిగ్ బాస్ విశేషాలను ట్విట్టర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆదివారం రాత్రి ట్విటర్‌ వరల్డ్‌వైడ్‌ ట్రెండ్స్‌లో ఈ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వ‌న్‌గా నిలిచింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన నాగ్.. ''అందరికీ ధన్యవాదాలు.. ట్విట్టర్‌లో బిగ్ బాస్ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది'' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X