బాత్రూమ్ టబ్‌లో భార్యతో వరుణ్ రొమాన్స్.. ఇద్దరు ఎలిమినేషన్ నుంచి సేఫ్
మాస్ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. స్టెపులతో అదరగొడుతూ చలాకీగా వేదికపైకి ప్రవేశించాడు. పాటను ముగించి మాటలతో అల్లరి చేశాడు. వేదిక వద్ద ఉన్న ఆడియెన్స్ విష్ చేసి కార్యక్రమంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మన టీవీలో శనివారం ఇంటి సభ్యులు యాక్టివిటీని చూశాడు. ఇంటి సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యతను నాగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. శనివారం రాత్రి షోలో ఏం జరిగిందంటే..

పిల్లోతో గేమ్ ఆడుతూ
ఇంటి సభ్యులతో మాట్లాడుతూ నాగ్ ఓ పిల్లో గేమ్‌ను ఆడించాడు. మ్యూజిక్ ప్లే చేసి పిల్లోను ఇంటి సభ్యులు చేతిలో పెట్టాడు. మ్యూజిక్ ఎక్కడ ఆగుతుందో ఆ వ్యక్తితో నాగ్ మాట్లాడాడు. ఆ క్రమంలో తొలుత జాఫర్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో చనువగా మాట్లాడారు. అవసరమైన చోట క్లాస్ పీకారు. మరోసారి ఇంటి సభ్యులకు మంచి మాటలు చెప్పారు.

బాత్రూమ్ టబ్‌లో రొమాన్స్
ఈ సందర్భంగా వరుణ్ సందేశ్, వితికను ఆటపట్టించాడు. బాత్రూమ్ టబ్‌లో రొమాన్స్ ఏంటని ప్రశ్నించగా.. థింకింగ్ టబ్ అంటూ వితిక సమాధానం ఇచ్చింది. వితిక ఇంటి నుంచి వెళితే బాగుండనే విధంగా వరుణ్ ఆలోచిస్తున్నాడని నాగ్ షాక్ ఇచ్చారు. దాంతో అలాంటిదేమీ లేదని వరుణ్ చెప్పాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం నుంచి పాట పాడి వరుణ్ ఆకట్టుకొన్నాడు.

సేఫ్‌జోన్‌లోకి పునర్నవి
ఇక మొదటివారం ఎలిమినేషన్ నుంచి బయటపడింది పునర్నవి. ఓటింగ్ తనకు ఎక్కువగా రావడంతో ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్లిందని నాగార్జున చెప్పాడు. మిగితా నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని ఆదివారం చెబుతానని సస్పెన్స్‌కు తెర లేపారు. ఆ నలుగురితో పాటు సెలబ్రిటీలు అందరూ హ్యాపీగా నిద్రపోవాలని చెప్పారు.


Click it and Unblock the Notifications











