Exclusive: 9వ వారం నామినేటైన కంటెస్టెంట్లు వీళ్లే.. అతడిని టార్గెట్ చేయడంతో రచ్చ.!

By Manoj Kumar P

తెలుగులో ప్రసారం అయిన ప్రతిసారీ అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది బిగ్ బాస్ షో. దేశంలోని చాలా భాషల్లో వస్తోన్న ఈ షో.. మన దగ్గర మాత్రమే వాటన్నింటినీ మించిన రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన నాలుగో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 9వ వారం నామినేషన్ ప్రక్రియ వివరాలు బయటకు వచ్చాయి. ఈ వారం ఐదుగురు సభ్యులు నామినేట్ అవగా, కొన్ని గొడవలు జరిగాయి. ఆ వివరాలు ఎక్స్‌క్లూజివ్‌గా మీకోసం.!

 నెంబర్ వన్ షోపై అనుమానాలు

నెంబర్ వన్ షోపై అనుమానాలు

తెలుగులో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గత నెలలో ప్రారంభం అయిన నాలుగో సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్ అయితే.. 18 పైచిలుకు టీఆర్పీ రేటింగ్ సాధించి బుల్లితెరపై చరిత్ర సృష్టించింది. ఇంతటి పేరున్న బిగ్ బాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీజన్ల కంటే ఈ సారి చాలా మంది షోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాళ్లను పంపడంపై విమర్శలు

వాళ్లను పంపడంపై విమర్శలు

సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సహా కొన్ని పరిణామాల వల్ల బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకాదరణ ఉన్న కొందరు కంటెస్టెంట్లు అనూహ్యంగా ఎలిమినేట్ అవడం.. అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లడంపై వ్యతిరేకత వస్తోంది. షో నిర్వహకులు ప్లాన్ ప్రకారమే వాళ్లను పంపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఎనిమిదో వారం.. ఎవరూ లేరు

ఎనిమిదో వారం.. ఎవరూ లేరు

గడిచిన వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీళ్లలో అమ్మ రాజశేఖర్ కానీ, మెహబూబ్ కానీ ఎలిమినేట్ అవుతారని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, ఊహించని విధంగా ఎనిమిదో వారంలో ఎవరూ బయటకు వెళ్లలేదు. హౌస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నోయల్ అనారోగ్యంతో బయటకు వెళ్లడంతో నామినేషన్‌లో ఉన్న వాళ్లందరూ సేవ్ అయ్యారు.

కోడిగుడ్డుతో నామినేషన్ ప్రక్రియ

కోడిగుడ్డుతో నామినేషన్ ప్రక్రియ

9వ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కోడిగుడ్డుతో ప్లాన్ చేశారు బిగ్ బాస్ షో నిర్వహకులు. ఈ వారం ఇంటి సభ్యులు.. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్‌మేట్ల తలలపై కోడిగుడ్డును పగలగొట్టి.. వాళ్లను ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో అందుకు తగిన కారణాలు చెప్పాలి. చివరికి ఎవరి తలపై ఎక్కువ గుడ్లు పగులుతాయో వాళ్లు నామినేట్ అవుతారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
9వ వారం నామినేటైన కంటెస్టెంట్లు

9వ వారం నామినేటైన కంటెస్టెంట్లు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... 9వ వారం ఆసక్తికరంగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఐదుగురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో అభిజీత్, అమ్మ రాజశేఖర్, అవినాష్, మోనాల్ గజ్జర్‌తో పాటు దేత్తడి హారిక ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా ఆరియానాకు ఇమ్యూనిటీ లభించడంతో ఆమెకు ఎవరూ ఓట్ చేయలేరు.

 అతడిని టార్గెట్ చేయడంతో రచ్చ.!

అతడిని టార్గెట్ చేయడంతో రచ్చ.!

ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ మంది ఇంటి సభ్యులు అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ టాస్క్ సమయంలో వాళ్లందరిపై ఆయన అసహనాన్ని వెల్లగక్కారని సమాచారం. ఆ తర్వాత అభిజీత్‌తో వాగ్వాదానికి కూడా దిగారట. వీళ్లిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఆపేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X