రాజకీయాల్లోకి బిగ్‌బాస్ సెలబ్రిటీ.. పవన్ కల్యాణ్ సపోర్ట్‌తో.. జాతీయ పార్టీలోకి!
అద్భుతమైన స్పందనతో తెలుగులో చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేస్తూ... తిరుగులేని షోగా వెలుగొందుతోంది 'బిగ్ బాస్' రియాలిటీ షో. సీజన్ సీజన్‌కు ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోన్న ఈ షో భారీ రేటింగ్‌ను అందుకుంటూ చాలా కార్యక్రమాలకు బలమైన టార్గెట్‌ను ఫిక్స్ చేస్తోంది. ఇంత విజయవంతమైన ఈ షో ద్వారా ఎంతో మంది భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడీ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సపోర్టుతో ఓ కంటెస్టెంట్ ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

సినిమాల్లో ఫేమస్.. సీరియల్స్‌లోనూ
చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు సీనియర్ నటి కరాటే కల్యాణీ. ‘బాబీ' అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్‌ను అందుకున్న ఆమె.. వరుసగా సినిమా ఆఫర్లను కూడా ఒడిసిపట్టుకున్నారు. అదే సమయంలో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయిన పలు సీరియల్స్‌లోనూ మంచి పాత్రలను పోషించి గుర్తింపును తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ ఎంట్రీ... జిగేల్‌మనిపించింది
వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న కరాటే కల్యాణీ ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున సారథ్యంలో వచ్చిన ప్రారంభ ఎపిసోడ్‌లో సంప్రదాయమైన వస్త్రాధరణతో హౌస్‌లోకి ప్రవేశించారామె. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు.

వెళ్తూ వెళ్తూ ఇంకొకరిని తీసుకెళ్లింది
కొన్ని వివాదాలు.. చిన్న చిన్న గొడవల కారణంగా బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యుల వల్ల రెండో వారానికి నామినేట్ అయింది కరాటే కల్యాణీ. ఆ వీక్‌లో తక్కువ ఓట్లు పడడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అదే సమయంలో తనకు వచ్చిన బిగ్ బాంబ్‌ను ప్రయోగించి దేవీ నాగవల్లిని నామినేట్ చేసింది. దీంతో ఆమె కూడా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

ట్రెండింగ్.... వివాదాస్పద వ్యాఖ్యలు
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కరాటే కల్యాణీ.. ఎన్నో న్యూస్, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సందర్భంగా ఎన్నో వివాదాస్పద విషయాలను వెల్లడించింది. అదే సమయంలో కొందరు కంటెస్టెంట్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగింది.

రాజకీయాల్లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్
బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేందుకు కరాటే కల్యాణీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు, 2024 ఎన్నికల లోపు బలమైన నాయకురాలిగా ఎదిగేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ సపోర్ట్‌తో గెలిచేందుకు ప్లాన్లు
కల్యాణీ... భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారట. దీనికి కారణం ఆ పార్టీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడమే అని సమాచారం. ఆ పార్టీలో చేరితే జనసేనానితో పాటు సైనికుల మద్దతు కూడా ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఏపీలో పోటీ చేస్తారా.? లేక తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించబోతున్నారా.? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











