ఒక్క టాస్క్‌తో ఫలితం తారుమారు: ఎలిమినేషన్ ప్రమాదంలో సోషల్ మీడియా సెన్సేషన్.!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. నిర్వహకులు పెట్టే టాస్కులకు తోడు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఈ రియాలిటీ షోపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో షోకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. ఇక, ఈ వారం జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ వల్ల షోలోని కంటెస్టెంట్ల వ్యక్తిత్వాలు బయటకు వచ్చాయి. దీని వల్ల కొందరు హీరోలు అవగా, మరికొందరు జీరోలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిదే టాస్క్ ఓ సెలెబ్రిటీని డేంజర్ జోన్‌లో నిలిపినట్లు వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.? వివరాల్లోకి వెళితే..

ఆ మాత్రం ఉందంటే గ్రేటేనంటున్నారు
ఒక్క ప్రీమియర్ ఎపిసోడ్ మినహాయిస్తే... బిగ్ బాస్ షోకు పెద్దగా ఆదరణ లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో దీనికి కష్టాలు తప్పవన్న టాక్ వినిపించింది. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బిగ్ బాస్ సగటున 8 వరకు రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇది గొప్పేనంటున్నారు విశ్లేషకులు.

సరికొత్తగా.. ఉక్కు హృదయం టాస్క్
ఈ వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యులకు ‘ఉక్కు హృదయం' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను రెండు భాగాలు చేసి.. ఒక జట్టును రోబోలుగా, మరో టీమ్‌ను మనుషులుగా తయారు చేశాడు. రోబోల బ్యాటరీలు అయిపోయేలా చేస్తే మనుషులు గెలిచినట్లు.. టాస్క్ అయ్యేలోపు తమ పవర్ నిలుపుపుకుంటే రోబోలు గెలిచినట్లు అని చెప్పాడు.

అభిజీత్ మాస్టర్ ప్లాన్‌తో గొడవ స్టార్ట్
ఈ టాస్క్‌లో రోబోల టీమ్ సభ్యుడైన అభిజీత్... మనుషుల టీమ్ నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, చార్జింగ్ పెట్టుకుందామని మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకు అనుగుణంగానే దివిని ఇంట్లోకి తీసుకెళ్లి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసుకున్నారు. అభి తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు జట్ల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు అతడిపై బూతుల వర్షం కురిపించారు.

ఓవర్ రియాక్షన్‌తో విమర్శల పాలు
దివిని కిడ్నాప్ చేసిన సమయంలో ఆమెకు ఇబ్బంది కలగకుండా సపర్యలు చేశారు రోబో టీమ్ సభ్యులు. కానీ, బయట ఉన్న మనుషుల టీమ్ సభ్యుల మాత్రం అభిజీత్ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మెహబూబ్, సోహెల్ అతడిపై ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్ ఏడుస్తూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

ఒక్క టాస్క్‌తో ఫలితం తారుమారు
ఇక, ఈ టాస్క్‌లో అతి చేసిన వారిలో ఒకడైన మెహబూబ్... ఈ వారం నామినేషన్ జాబితాలో ఉన్నాడు. టాస్క్‌కు ముందు అతడికి మంచిగా ఓటింగ్ జరిగింది. కానీ, ఉక్కు హృదయం టాస్క్ తర్వాత అతడు ఏకంగా చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. దీంతో అతడు ఎలిమినేషన్‌కు దగ్గరలో ఉన్నాడట. మరి చివరి రోజు ఓటింగ్ మారుతుందా లేక అతడే వెళ్లిపోతాడా చూడాలి.
Recommended Video

పోరాటంతో యాంకర్ సేఫ్ జోన్‌లోకి
టాస్క్ ముందు వరకూ యాంకర్ అరియానా గ్లోరీ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, రోబోగా తన టీమ్ కోసం చేసిన పోరాటం ఆమెకు చాలా ఉపయోగపడిందట. అంతేకాదు, టీమ్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. సహచరులకు సలహాలు ఇస్తూ ఆకట్టుకోవడం ద్వారా ఈ టాస్క్ తర్వాత ఆమె ఏకంగా రెండు స్థానాలు పైకి చేరుకుని సేఫ్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











