Exclusive: ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే.. తప్పించుకున్న లవర్‌ బాయ్.!

By Manoj Kumar P

కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంటూ తెలుగులోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. గతంలో ఏ షోకూ అందని ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లోనూ టాప్ ప్లేస్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదలైన నాలుగో సీజన్‌కూ మంచి స్పందన వస్తోంది. అయితే, ప్రసారానికి ముందే కొన్ని అంశాలు లీకవడం యూనిట్‌ను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన నామినేషన్ ప్రాసెస్ ముందే లీకైంది. అంతేకాదు, నామినేట్ అయిన సభ్యుల పేర్లు కూడా బయటికొచ్చాయి. వివరాల్లోకి వెళ్తే...

గత సీజన్లు మించిన రెస్పాన్స్‌తో మొదలు

గత సీజన్లు మించిన రెస్పాన్స్‌తో మొదలు

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందీ షో. ఇక, ఇటీవల నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించారు నిర్వహకులు. ఈ సీజన్‌పై మొదటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ.. ప్రీమియర్ ఎపిసోడ్‌‌ను నడిపించారు. దీంతో ఈ ప్రారంభ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది.

ఆసక్తిని పెంచేందుకు అన్నీ అమలు చేశారు

ఆసక్తిని పెంచేందుకు అన్నీ అమలు చేశారు

ప్రీమియర్ ఎపిసోడ్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన షోకు మాత్రం అంతగా స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు ఎన్నో వ్యూహాలు అమలు చేశారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు పరిచయం చేయడం.. లవ్ ట్రాకులపై పోకస్ పెంచడం.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ముందే దింపడం వంటివి చేసి ప్రేక్షకుల్లో షోపై ఆసక్తిని పెంచేశారు.

ఆరంభం నుంచి మొత్తం రహస్యంగానే ఉంచి

ఆరంభం నుంచి మొత్తం రహస్యంగానే ఉంచి

బిగ్ బాస్ షో ప్రాసెస్ మొత్తం ఎంతో రహస్యంగా జరుగుతూ ఉంటుంది. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి మొదలుకొని.. వాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్, ఒప్పంద పత్రాలకు సంబంధించిన డీటేల్స్ సహా ఎలిమినేషన్ అయ్యే సభ్యుడి వివరాల వరకు అన్నీ సీక్రెట్ గానే ఉంచుతున్నారు. ఇక, ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాళ్లు షో రహస్యాలు లీక్ చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

ఎలిమినేషన్ విషయంలో షాకులే షాకులు

ఎలిమినేషన్ విషయంలో షాకులే షాకులు

బిగ్ బాస్ నిర్వహకులు షోకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. కానీ, ఎలిమినేషన్ విషయంలో వాళ్లకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ వరకు ప్రతిసారీ ఇంటి నుంచి బయటకు వెళ్లేది ఎవరో ముందే లీక్ అవుతోంది. ఫలితంగా ఆ ముఖ్యమైన ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోంది.

నామినేషన్ ప్రాసెస్ కూడా లీక్ చేసేశారుగా

నామినేషన్ ప్రాసెస్ కూడా లీక్ చేసేశారుగా

ఇప్పటికే ఎన్నో లీకులతో బిగ్ బాస్ యూనిట్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన నామినేషన్ ప్రాసెస్ కూడా ఒకరోజు ముందే బయటకు వచ్చేసింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ తర్వాత అంటే సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఆదివారమే లీక్ అయ్యాయని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సోమవారం జరగనున్న నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్ సార్థక్, లాస్య, అమ్మ రాజశేఖర్, ఆరియానా గ్లోరీ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. అయితే, ఇప్పటి వరకూ వరుసగా నామినేట్ అవుతూ వస్తోన్న లవర్ బాయ్ అభిజీత్ మాత్రం ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X