Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అత్తా, కోడళ్ల సీరియల్స్‌పై బిగ్‌బాస్ సెటైర్లు.. వాటికంటే 100 రెట్ల వినోదం అంటూ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరింత కలర్ఫుల్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదనే విషయం ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు వదులుతున్న ప్రోమోలను బట్టి స్పష్టమవుతున్నది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు ప్రోమోలు రియాలిటీ షోపై అంచనాలు పెంచేసేలా ఉన్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగార్జున వేసిన సెటైర్లు టెలివిజన్ సీరియల్స్‌ను గట్టిగానే తగిలేలా ఉన్నాయి. అత్తా, కోడళ్ల మధ్య ఉండే కంటెంట్‌కు వందరెట్లు మించి వినోదం ఉందనే గ్యారెంటీ ఇస్తున్నారు. ఓసారి ప్రోమోలు, ప్లానింగ్ విషయానికి వస్తే..
Recommended Video
ప్రోమోలతో క్రేజీగా..
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ షోకు భారీ క్రేజ్‌ను కలిగించేందుకు ప్లానింగ్ మొదలైంది. హోస్ట్ నాగార్జున ఇప్పటికీ ప్రోమోల ప్రోమోలతో దడడడలాడిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రోమోలతో హంగామా సృష్టించారు. తాజాగా వచ్చిన ప్రోమోలో మాత్రం ఎంటర్టైన్మెంట్ రేంజ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. తాజాగా చేసిన వీడియో టెక్నికల్‌గా కూడా ఆకట్టుకొన్నది.
ట్రిపుల్ రోల్స్‌లో నాగార్జున ప్రోమోకు భారీ రెస్పాన్స్
తాజాగా బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన వీడియోను ఎండెమాల్ షైన్ ఇండియా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగార్జున మూడు పాత్రల్లో కనిపించారు. గత ప్రోమోలో కనిపించిన విధంగానే ముసలి నాగార్జునతోపాటు మరో ఇద్దరు క్లాస్; మాస్ యువకులైన నాగార్జున తెరపైకి వచ్చారు. ప్రోమోలో విషయంలో రాజీ పడటం లేదంటే టెక్నికల్‌గా బిగ్‌బాస్ 4 ఉండబోతుందనే క్లారిటీ వచ్చేసింది.
అత్తా కోడళ్ల షో కంటే మరింత మిన్నగా
పక్కింట్లో అత్తా, కోడళ్ల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, కోపాతాపాలను దొంగచాటుగా చూస్తూ ఇంతకంటే వినోదం ఏముంటుంది అంటూ తండ్రి కొడుకులు అంటారు. ఇలాంటి మహానటుల చుట్టూ ఉండగా ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది అంటూ తండ్రి, కొడుకులు అంటారు. దానికి మరో అబ్బాయి నాగ్ తనదైన శైలిలో స్పందించారు.
ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ అంటూ
అత్తా కోడళ్ల కంటే వంద రెట్ల బెటర్ ఎంటర్టైన్మెంట్ నేను సెట్ చేస్తాను. తీయ్యండి రిమోట్లు, ఫిక్స్ అవ్వడం బిగ్‌బాస్ కోసం. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్టైన్మెంట్. ఇక్కడంతా లైవ్ అని హోస్ట్ నాగార్జున అనగానే.. వాటే వావ్ వావ్ అంటూ మరో ఇద్దరు నాగార్జునలు శృతికలిపారు. బిగ్‌బాస్ 4 ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ అంటూ ప్రోమోను నాగార్జున ముగించారు.
ఆగస్టు 30న ప్రారంభం
2020లో బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ షోను ఆగస్టు 30న ప్రారంభించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో హీరో, హీరోయిన్లు షూటింగులకు దూరమై ఖాళీగా ఉండటంతో పలువురు హాట్ తారలను బిగ్‌బాస్‌లోకి దించుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.