Exclusive: బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌ పేరు లీక్.. ముగ్గురమ్మాయిలకు చుక్కలు చూపిస్తూ!

By Manoj Kumar P

ఎన్నో అనుమానాలు.. మరెన్నో వివాదాల నడుమ తెలుగులో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. సరికొత్త అంశాలతో ప్రసారం అయిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా మొదటి సీజన్‌ నుంచి విజయవంతంగా ప్రసారం అవుతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల నాలుగో సీజన్ కూడా మొదలైంది. రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌ కూడా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కొత్త కెప్టెన్ వివరాలు తాజాగా లీకయ్యాయి. ఆ విశేషాలు మీకోసం.!

వాటి బాటలోనే ఈ సీజన్ కూడా

వాటి బాటలోనే ఈ సీజన్ కూడా

బిగ్ బాస్ షో తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే నాలుగోది కూడా ఇప్పటికే మొదలైంది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, గొడవలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కామెడీ సన్నివేశాలు వీటన్నింటి కారణంగా ఈ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది.

సమంత రాకతో మారిన లెక్కలు

సమంత రాకతో మారిన లెక్కలు

బిగ్ బాస్ షో మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దానిని నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్‌తో పాటు ప్రస్తుతం ప్రసారమవుతోన్న దానిని కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం ఆయన ఓ వారం షోకు దూరమయ్యారు. ఆయన స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సమంత అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకోవడంతో రేటింగ్ కూడా పెరిగిపోయింది.

చిరాకు తెప్పించిన కొత్త టాస్కు

చిరాకు తెప్పించిన కొత్త టాస్కు

ఈ వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్‌లో ‘బిగ్ బాస్ డే కేర్ సెంటర్' అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కొందరు సభ్యులు పిల్లల్లా, మరికొందరు వాళ్ల కేర్ టేకర్లలా మారిపోయారు. కేర్ టేకర్లు తమ పిల్లలను మంచిగా చూసుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. దాదాపు రెండు రోజుల పాటు సాగిన ఈ టాస్క్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.

ఆ సీన్లపై విమర్శలు... ఇద్దరు

ఆ సీన్లపై విమర్శలు... ఇద్దరు

‘బిగ్ బాస్ డే కేర్ సెంటర్' టాస్కులో భాగంగా పిల్లలకు కేర్ టేకర్లు అన్నం తినిపించడం, తయారు చేయడం, స్కూల్‌కు తీసుకెళ్లడంతో పాటు ఆటలు ఆడించడం వంటివి చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పిల్లలకు డైపర్లు వేయడం ఎబ్బెట్టుగా అనిపించింది. అలాగే కొందరి ఓవర్ యాక్టింగ్ చిరాకు తెప్పించింది. ఇక, ఈ టాస్కులో సోహెల్, ఆరియానా బెస్ట్ పెర్ఫార్మర్లు నిలిచారు.

కెప్టెన్సీ టాస్క్ వివరాలు లీక్

కెప్టెన్సీ టాస్క్ వివరాలు లీక్

బిగ్ బాస్ నిర్వహకులు షోకు సంబంధించిన విషయాలు అన్నింటినీ ఎంతో రహస్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ తరచూ ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. నామినేషన్స్, ఎలిమినేషన్స్, టాస్కులు వివరాలు ఇలా ఎన్నో వివరాలు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ పేరు కూడా ముందే తెలిసిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
కొత్త కెప్టెన్‌గా గ్లామరస్ బ్యూటీ

కొత్త కెప్టెన్‌గా గ్లామరస్ బ్యూటీ

వారం మధ్యలో నిర్వహించే కెప్టెన్సీ టాస్క్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. లాస్య మంజునాథ్, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీ మధ్య కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో మిగిలిన ముగ్గురు అమ్మాయిలకు చుక్కలు చూపించడంతో పాటు బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది ఆరియానా. ప్రస్తుతం ఇంటి కెప్టెన్‌గా అవినాష్.. ఆమెకు కెప్టెన్సీ బాండ్‌ను అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X