బిగ్‌బాస్ బ్యూటిపై మోజుపడ్డ నాగార్జున.. ఇంత అందంగా ఉన్నావంటూ.. రొమాంటిక్‌గా మన్మథుడు

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ వేదిక మీదకు చేరి హోస్ట్ నాగార్జునతో ముచ్చటించింది. సండే ఫండే కావడంతో ఇంట్లో జంబలకిడి పంబ స్కిట్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాత ఇంటిలో మిగిలిన నామినేట్ అయిన సెలబ్రిటీలను భరతం పట్టారు. స్వాతి దీక్షిత్ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన సెలబ్రిటీ ఎవరంటే..

స్వాతి దీక్షిత్‌తో ఫన్ గేమ్

స్వాతి దీక్షిత్‌తో ఫన్ గేమ్

ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్‌తో నాగార్జున గేమ్ ఆడించారు. అహంకారి, నమ్మకద్రోహి లాంటి కార్డులు తీసుకొని ఇంటి సభ్యులకు సూట్ అయ్యే వాటిని సూచించాలని.. అలా కార్డులను సెలబ్రిటీలు మెడలో వేసుకోవాలని రూల్ చెప్పారు. దాంతో కార్డులను తీసుకొని ఇంటి సభ్యులకు సూచించే కార్యక్రమాన్ని స్వాతీ దీక్షిత్ చేపట్టింది.

ఇంటి సభ్యుల యాటిట్యూడ్‌ను బట్టి

ఇంటి సభ్యుల యాటిట్యూడ్‌ను బట్టి

ఇంటి సభ్యుల యాటిట్యూడ్‌ను బట్టి నక్క తోక తొక్క్కిన వ్యక్తి కార్డును కుమార్ సాయికి, అహంకారి కార్డును అభిజిత్‌కు, గాసిప్స్ ప్రచారం చేసే వ్యక్తి కార్డును సుజాతకు, చాడీలు చెప్పే వ్యక్తి కార్డును గంగవ్వకు, నమ్మకద్రోహి కార్డును అమ్మా రాజశేఖర్‌కు, మ్యానుపులేటర్ కార్డును మోనాల్‌కు, ఫోకస్ లేని వ్యక్తిగా అఖిల్‌ను, అలా ప్రతీ ఒక్కరికి ఒక్కో కార్డును ఇచ్చింది.

అమ్మా రాజశేఖర్‌పై బిగ్‌బాంబ్

అమ్మా రాజశేఖర్‌పై బిగ్‌బాంబ్

ఆ తర్వాత బిగ్‌బాంబ్ వేయాలని స్వాతి దీక్షిత్‌కు నాగార్జున అవకాశం ఇచ్చారు. బిగ్‌బాంబ్ ప్రకారం ఇంటి సభ్యుడు ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనకూడదు. అయితే స్వాతి దీక్షిత్ తన బాంబును అమ్మా రాజశేఖర్‌పై స్వాతి వేసింది. దాంతో ప్రస్తుత వారానికి అమ్మా రాజశేఖర్ కెప్టెన్సీ రేసుకు అనర్హుడిగా మారారు.

బిగ్‌బాస్‌లో జంబలకిడిపంబ

బిగ్‌బాస్‌లో జంబలకిడిపంబ

ఇక సండే కావడంతో ఫన్ గేమ్ తెర తీశారు. ఇంటి మేల్ కంటెస్టెంట్లు ఆడవాళ్లుగా, ఫీమేల్ కంటెస్టెంట్లు మగవాళ్లుగా మారిపోయారు. ఆడవాళ్ల వేషంలో ఉన్న మగ కంటెస్టెంట్లలో సోహైల్‌‌కు సోనాలీ అని, అమ్మా రాజశేఖర్‌కు రజని, అఖిల్‌కు అఖిల, గంగవ్వకు గంగు అని ఇలా పేర్లు పెట్టారు. సోనాలీగా ఆడవేషం వేసిన సోహైల్‌ మరింత అందంగా ఉండటంతో నాగార్జున ముచ్చటపడిపోయారు.

టాప్‌గా సుజాత, అమ్మా రాజశేఖర్

టాప్‌గా సుజాత, అమ్మా రాజశేఖర్

ఇక ఆడ వేషంలో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్లకు, మగ వేషంలో ఉన్న మేల్ కంటెస్టెంట్ల ఒక్కక్కరిని జంటగా చేసి డ్యాన్సులు, స్కిట్స్ చేశారు. సుజాత, రజిత జంట చూడాలని ఉంది సినిమాలోని పద్మావతి సీన్‌ను చేశారు. హారిక, ముక్కు అవినాష్ జంట ఖుషీ సినిమాలోని నడుము సీన్ చేశారు. గంగవ్వ, కుమార్ సాయి జంట ముత్యాలు వస్తావా అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ గేమ్‌లో సుజాత, అమ్మా రాజశేఖర్‌కు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది.

నాగార్జున ఎలిమినేషన్ ట్విస్టు

నాగార్జున ఎలిమినేషన్ ట్విస్టు

ఇంటి సభ్యుల్లో నామినేట్ అయిన వారిపై ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. వారికి ఆరు నెంబర్లు స్టాండ్లు ఇచ్చి ఎవరెవరు ఏ నెంబర్‌లో నుంచొంటారో తేల్చుకోవాలని నాగ్ సూచించారు. 1 నంబర్‌లో అభిజిత్ ఉండగా, 2 నంబర్‌లో మెహబూబ్ 3, నంబర్‌లో లాస్య, నాలుగో నంబర్‌లో 5, 6, 7 నంబర్ల కోసం సోహైల్, కుమార్ సాయి, హారిక పోటీ పడ్డారు. అయితే ఇంటి సభ్యుల సూచన మేరకు 4లో సోహైల్, 5లో కుమార్ సాయి, 6 నంబర్‌లో హారిక‌ ఫిక్సయ్యారు. అయితే ఆరుస్థానాల్లో నిలబడిన వారి ర్యాంకులు అవికాదు. కానీ మీ అందర్నీ ప్రేక్షకులు సేఫ్ చేశారు అంటూ నాగార్జున ట్విస్టు ఇచ్చారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Swati Dixit Eliminated కొంపతీసి గెస్ట్ గా వచ్చిందా ?
సోహైల్‌ను చూసి నాగార్జున ఫిదా

సోహైల్‌ను చూసి నాగార్జున ఫిదా

అందరి కంటే అందంగా, ఆడపిల్లలు కూడా సైట్ కొట్టే విధంగా ఆడవేషం వేసిన సోహైల్‌ను చూసి నాగార్జున ఫిదా అయ్యారు. చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ విసిరారు. నీలో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్ చేశారు. ఇంక మగవాళ్ల రూపంలో ఉన్న ఫీమెల్ కంటెస్టెంట్లు కూడా సోహైల్‌పై మోజు పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X