బిగ్‌బాస్ సీజన్ 4 జాబితా లీక్.. లాక్‌డౌన్‌లో జోరుగా సెలబ్రిటీల ఎంపిక..

కరోనా వైరస్ కారణంగా బిగ్‌బాస్ రియాల్టి షోలు పలు భాషల్లో రద్దు కాగా, ప్రారంభం కావాల్సిన షోల పరిస్థితిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే కరోనా లాక్‌డౌన్ ఎత్తివేస్తే మాత్రం రియాలిటీ షోలను ప్రారంభించడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన సెలబ్రిటీల జాబితాలోని పేర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్ది మందిని ఎంపిక చేసినట్టు ఓ జాబితా సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే ఆ జాబితాలోని పేర్లు ఇలా ఉన్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Mahesh Babu To Host Bigg Boss Telugu After Jr NTR,Nani & Nagarjuna
మలయాళంలో కీలక పరిణామాలు..

మలయాళంలో కీలక పరిణామాలు..

కరోనావైరస్ రాక ముందు మలయాళం బిగ్‌బాస్‌ పలు వివాదాలతో హాట్ హాట్‌గా మారింది. ఇక షో ఊపందుకొంటుందనే క్రమంలో కరోనా మహామ్మారి రంగం ప్రవేశం చేసింది. మార్చిలో చివరి వారంలో కొవిడ్ 19 ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితి చేజారింది. సిబ్బంది, సాంకేతిక నిపుణులకు కరోనా ముప్పు ఉండటంతో అనూహ్యంగా ఆ షోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి వరకు ఉన్న అందరు సెలబ్రిటీలకు ట్రోఫిలు ఇచ్చి బయటకు పంపించారు. షోను ఆకస్మికంగా రద్దు చేశారు. ఈ వ్యవహారం తెలుగు, తమిళ షోలపై కూడా ప్రభావం చూపింది.

బిగ్‌బాస్ సీజన్ 4పై కొవిడ్ 19 దెబ్బ

బిగ్‌బాస్ సీజన్ 4పై కొవిడ్ 19 దెబ్బ

కరోనావైరస్ లాక్‌డౌన్‌కు తమిళ బిగ్‌బాస్ షోకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. సెలబ్రిటీల ఎంపిక, ప్రాసెస్, సెట్టింగులు ఇతర కార్యక్రమాలు వేగం పుంజుకొన్నాయి. అలా భారీ ఏర్పాట్లకు కొవిడ్ 19 దెబ్బ కొట్టింది. మలయాళంలో బిగ్‌బాస్ షోను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఏర్పాట్లను నిలిపివేశారు.

కమల్ స్థానంలో శింబు అంటూ రూమర్లు

కమల్ స్థానంలో శింబు అంటూ రూమర్లు

విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్‌కు మంచి ప్రేక్షకాదరణతోపాటు విజయ్ టెలివిజన్‌కు మంచి రేటింగ్ కూడా వచ్చింది. అయితే కమల్ సినిమాలు, రాజకీయాల్లో బిజీగా కావడంతో హోస్ట్‌ను మారుస్తారనే ప్రచారం జరిగింది. కమల్ స్థానంలో శింబును హోస్ట్‌గా పెడుతారనే ఊహాగానాలు వచ్చాయి.

జూలైలో గానీ, ఆగస్టులో గానీ..

జూలైలో గానీ, ఆగస్టులో గానీ..

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలతో ఎంపిక, వారితో సంప్రదింపులు చేపడుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే తమిళ, తెలుగు బిగ్‌బాస్ షోలను జూలై చివరి వారంలో గానీ, ఆగస్టులో గానీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

లీకైన పేర్లు ఇవే

లీకైన పేర్లు ఇవే

ఇక తమిళ బిగ్‌బాస్ సెలబ్రిటీల లిస్టు ఇదే అంటూ ఓ జాబితా మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ జాబితాలో తమిళ సెలబ్రిటీలు రమ్య పాండ్యన్, పుగజ్, శివాంగి, వీజే మణిమెగలై పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ లీకైనా పేర్లు వాస్తవమా? లేక రూమర్ల అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే బిగ్‌బాస్ షో కోసం సెలబ్రిటీలను ఖారారు చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X