For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌ తెలుగు 4 కంటెస్టెంట్ల వీరే.. వైరల్‌గా సెలబ్రిటీల పేర్లు.. ఇద్దరు స్టార్ల మధ్య పోటీ

  |

  తెలుగు టెలివిజన్‌పై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటి షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఊపందుకొన్నాయి. ప్రణాళిక ప్రకారం పనులు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రోమోలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. గత నెలరోజుల్లోనే రెండు ప్రోమోలను, షూటింగ్‌కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచారు. ఈ తరుణంలో బిగ్‌బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి వైరల్ అవుతున్న పేర్లు ఏమిటంటే..

  లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా

  లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఉంటుుందా లేదా అనే అనుమానాలు భారీగానే వ్యక్తమయ్యాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది షోను ఆలస్యంగానైనా ప్రారంభిస్తామనే సంకేతాలను నిర్వాహకులు ఇచ్చారు. అయితే కరోనాపరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షోను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన సెలబ్రీటీలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారని, షో ప్రారంభానికి ముందు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.

  సెట్ నిర్మాణం, ప్రోమోల రిలీజ్

  సెట్ నిర్మాణం, ప్రోమోల రిలీజ్

  ఇక అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు యుద్ద ప్రతిపాదికన కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పనులు, సెలబ్రిటీల ఎంపిక ప్రక్రియ సజావుగా జరుగుతుండటంతో ప్రోమోలు రిలీజ్ చేసి షో ప్రసారంపై ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ముసలి గెటప్‌లో నాగార్జునతో షూట్ చేసిన ప్రోమోను రిలీజ్ చేయగా మంచి స్పందన వ్యక్తమైంది.

   పోటీ పడుతున్న స్టార్ కొరియోగ్రాఫర్లు

  పోటీ పడుతున్న స్టార్ కొరియోగ్రాఫర్లు

  బిగ్‌బాస్ షోలో ప్రతీ సీజన్‌లో కొరియోగ్రాఫర్ల ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తున్నది. డ్యాన్సర్ ముమైత్ ఖాన్, బాబా భాస్కర్ లాంటి కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచారు. ఇక నాలుగో సీజన్‌లో ఆ స్థానానికి ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు పోటీ పడుతున్నట్టు సమాచారం. వారిలో ఒకరు జానీ మాస్టర్ ఒకరైతే.. రెండో వ్యక్తి రఘు మాస్టర్. అయితే ఈ ఇద్దరు ఉంటారా? లేక ఎవరిలో ఒకరిని షోలో కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే. అయితే రఘు మాస్టర్ దంపతులు జోడీ క్యాటగిరీ కింద ఎంట్రీ ఇస్తున్నారనే విషయం ప్రచారంలో ఉంది.

   మీడియాలో ప్రచారమవుతున్న జాబితా

  మీడియాలో ప్రచారమవుతున్న జాబితా

  ఇక తాజాగా ప్రచారం జరుగుతున్న జాబితా ప్రకారం.. హంసా నందిని, పునమ్ బజ్వా, ప్రియా వడ్లమాని పేర్లు హీరోయిన్ల కేటగిరిలో వినిపిస్తున్నాయి. సింగర్ క్యాటగిరిలో గాయని సునీత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కమెడియన్ వైవా హర్ష, టెలివిజన్ నటుడు, కల్యాణి ఫేం అఖిల్ సార్ధక్, నటుడు, ర్యాపర్ నోయల్ సీన్, మహాతల్లి జాన్వీ దాశెట్టి, మంగ్లీ చిన్మయి, వర్షిణి సౌందర్య రాజన్, తాగుబోతు రమేష్, యామిని భాస్కర్ పేర్లు తెరపైకి వచ్చాయి.

  ఆగస్టు 30న షో ప్రారంభం

  ఆగస్టు 30న షో ప్రారంభం

  ఓ పక్క సెలబ్రిటీల ఎంపిక, సెట్ నిర్మాణ ఏర్పాట్లు, ఇతర మౌళిక సదుపాయాల ఏర్పాట్లు ఓ పక్క చేపడుతూనే బిగ్‌బాస్ షోను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 30వ తేదీన బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభానికి ముహుర్తంగా నిర్వహించారు. మరో పదిహేను రోజుల్లో రెండు ట్రైలర్లను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

  Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
  గత సీజన్లలో విజేతలు, హోస్టులు

  గత సీజన్లలో విజేతలు, హోస్టులు

  ఇప్పటి వరకు నిర్వహించిన మూడు సీజన్లు బ్రహ్మండంగా సక్సెస్ కావడంతో నాలుగో సీజన్‌ను మరింత కలర్‌ఫుల్‌గా రూపొందించే పనిలో ఉన్నారు. తొలి సీజన్‌లో శివ బాలాజీ విజేతగా నిలిస్తే.. రెండో సీజన్‌లో కౌశల్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్లుగా నిలిచారు. ఇక హోస్ట్‌గా ఫస్ట్ సీజన్‌కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని వ్యవహరించారు. ఇక మూడు సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున నాలుగో సీజన్లకు హోస్ట్‌గా కనిపించబోతున్నారు.

  English summary
  Bigg Boss Season 4 telugu news: Big Boss Telugu Show season 4 is getting ready to telecast. Reports sugggest that on August 30th show will be aired. As Some of the celebrities list have been leaked in the media for season 4. Viva Harsha, Akhil Sardak, Yamini Bhaskar, Mangli, Priya Vadlamani name are in the list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X