ఓట్లతో బిగ్‌బాస్‌ 4 సంచలనం.. గుద్ది పడేశారు.. గత ఏడాది కంటే డబుల్

బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి 105రోజుల ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ ఈ సీజన్ మధ్యలో కొంత నిరాశపరిచినప్పటికి ఫైనల్ లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ఇక సీజన్ 4 విజేతగా అనుకున్నట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. అయితే షోకు సంబంధించిన ఓట్ల విషయంలో బిగ్ బాస్ షో ఈ సారి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

దారుణమైన రేటింగ్స్..

దారుణమైన రేటింగ్స్..

షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోని బిగ్ బాస్ మధ్యలో కూడా కొంత వరకు బోర్ కొట్టిచిందనే చెప్పాలి. ఊహించని విధంగా కొన్నిసార్లు సీరియల్స్ కంటే దారుణమైన రేటింగ్స్ ను అందుకున్నాయి. ఒకసారైతే స్టార్ మా టాప్ ప్రోగ్రామ్ లిస్టులో 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో షో మళ్ళీ గాడిలో పడింది.

అతను గెలవడానికి కారణం

అతను గెలవడానికి కారణం

మొత్తానికి అందరూ ఉహించినట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. షో మొదలైన రెండు నెలలకే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు అందరు పసిగట్టేశారు. మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లే అతనికి బాగా కలిసొచ్చాయి. అభిజిత్ నిజానికి కొంతమంది మంది పడిన కష్టంలో కొంచెం కూడా పడలేదు. వీలైనంత వరకు పొరపాట్లు చేయకుండా తన గేమ్ తన స్టైల్ లో ఆడుతూ వచ్చాడు.

భారీగా ఓట్లు అందుకున్న అభిజిత్

భారీగా ఓట్లు అందుకున్న అభిజిత్

అభిజిత్ గెకవడానికి మరో ముఖ్య కారణం అతను పొరపాటు చేసినా కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చేవాడు. అతను చెప్పిన ప్రతి విషయం కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసేది. ఒక విధంగా బిగ్ బాస్ లో అభిజిత్ కు ఓట్లు కూడా చాలానే వచ్చాయి. తుది దశలో అఖిల్ కొంత వరకు పోటీకి వచ్చినప్పటికీ మొదటి నుంచి ప్రజాధరణ అభికే ఉంది కాబట్టి అతనే విజేతగా నిలిచాడు.

ఈ సారి పడిన ఓట్లు.. ఎన్నంటే..

ఈ సారి పడిన ఓట్లు.. ఎన్నంటే..

గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్ కు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య చాలా డబుల్ అని చెప్పవచ్చు. కంటెస్టెంట్స్ చాలా వరకు వారికంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకోవడంతో ఓట్లు కూడా భారీగానే పడ్డాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ సీజన్ 4కు మొత్తం 15కోట్ల 55లక్షలక్ ఓట్లు దక్కినట్లు నాగార్జున వివరణ ఇచ్చారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
గత ఏడాది కంటే ఎక్కువే..

గత ఏడాది కంటే ఎక్కువే..

బిగ్ బాస్ సీజన్ 3కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కంటే గత ఏడాది హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం ఎక్కువ స్థాయిలో గుర్తింపు అందుకున్నవారు. అయినప్పటికీ 2019 కంటెస్టెంట్స్ కు మొత్తం 8కోట్ల ఓట్లు మాత్రమే పడ్డాయి. 2020లో దాదాపు అంతకంటే డబుల్ రావడంతో క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X