Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్... టెలికాస్ట్ ఎప్పుడు కానుందో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో కేవలం 14 మంది మాత్రమే హౌజ్ లోపలికి వెళ్లారు. ఇక అందులో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది 12 మంది. ఇక అందులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వనుండగా... ఇక హౌజ్ లోపల 11 మంది మాత్రమే ఉంటారు. ఇక వారితో మిగతా వారాలు నడిపించడం కష్టమే. మరి అందుకే బిగ్ బాస్ సరికొత్త ప్లాన్ వేసింది. బిగ్ బాస్ తెలుగు 2.ఓ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి మూడు వారాలు కావొస్తుంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ షో నిర్వహాకులు ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఈసారి అంతా కొత్తగా ఉంది. హౌజ్ లో ఎప్పుడైనా 18 నుంచి 20 మంది ఎంటర్ అవుతారు. కానీ ఈసారి ఉల్టా పుల్టా కాబట్టి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే లోపలికి వెళ్లారు. ఇక పవర్ అస్త్ర సాధిస్తేనే హౌజ్ మేట్ అవుతారు అంటూ కండిషన్ కూడా పెట్టారు.

ఇక ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా పోగా.. 12 మంది కంటెస్టెంట్స్ హోజులో ఉన్నారు. వీరిలో ఈ వారం దామిని ఎలిమినేట్ అయిందని అంటున్నారు. ఇక ఆమె పోతే.. కేవలం హౌజులో 11 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఇప్పటికే ఆట సందీప్, శివాజీ హౌజ్ మేట్స్ గా ఎన్నికయ్యారు. ఈ వారం ప్రియాంక, శోభాలో ఎవరు కానున్నారో చూడాలి.
ఇక ఆ విషయం పక్కన పెడితే.. హౌజ్ ను కేవలం 11 మందితో రన్ చేయండ కష్టం. ఇంకా చాలా వారాలు ఈ షో ను నిర్వహించాలి. అందులోనూ వారం వారం పక్క ఒకరి ఎలిమినేషన్ ఉంటుంది. చివరి వారం వచ్చే వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ మిగులుతారు. అలా జరగాలి అంటే ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉండాలి. అయితే ప్రతివారం వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఏర్పడ్డాయి. కానీ ప్రతివారం బిగ్ బాస్ షాక్ ఇస్తునే.. ఎవరినీ హౌజ్ లోకి తీసుకురాలేదు.

దానికి కారణం.. త్వరలో బిగ్ బాస్ తెలుగు 2.ఓ గ్రాండ్ లాంఛ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ గ్రాండ్ లాంచ్ .. మొదటి మొదట ఎలాగైతే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో ఇందులో కూడా పలువురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 7 2.ఓ గ్రాండ్ లాంఛ్ అక్టోబర్ 8వ తేదీన ఉండబోతున్నట్లు బిగ్ బాస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ లాంఛ్ కార్యక్రమంలోనే పలువురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మరి బిగ్ బాస్ సీజన్ 7 2.0 గ్రాండ్ లాంఛ్ లో ఇప్పటికే సీరియల్ హీరో అంబటి అర్జున్, పూజా మూర్తి ఖాయమయ్యారు. మరో 6 మంది సైతం ఎంటర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయితే మరి ఎలాంటి గొడవలు, మసాలాలు ఉంటాయో చూడాల్సిందిే.


Click it and Unblock the Notifications











