ఫస్ట్ డేనే గొడవలు షూరు.. పిల్ల బచ్చాలు అంటూ మాస్ వార్నింగ్..

Bigg Boss Season 8: బిగ్ బాస్... బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 8 ఆదివారం నాడు చాలా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు.. అది కూడా బడ్డీలుగా హౌస్‌లోకి ఎంటరయ్యారు. సీజన్ ప్రారంభం నుంచే దిమ్మ తిరిగే ట్విస్టులు ఇస్తూ.. ప్రేక్షకులకు అల్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు బిగ్ బాస్. ఈ సారి లాంచ్ ఈవింట్ లోనే కంటెస్టెంట్స్ దిమ్మతిరిగిపోయే.. రూల్స్ పెట్టారు బిగ్‌బాస్. హౌస్ ఎలా ఉండాలో.. ఎలా నడుచుకోవాలో వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఈ సీజన్ లో రూల్స్ చాలా డిఫిరెంట్ గా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్లో హౌస్‌కి కెప్టెన్ లేరంటూ కంటెస్టెంట్లకు షాకిచ్చారు కింగ్ నాగార్జున. అంతటితో ఆగకుండా.. ఆ తరువాత నో పుడ్ అంటూ..షాక్ ఇచ్చారు. కానీ పుడ్ కోసం ఏం చేయాలో.. ఎలా నడుచుకోవాలో వివరించారు.

లాస్ట్ లో మరో ట్వీస్ట్.. చివరి ఎపిసోడ్ లో చూపించే ఫైజ్ మనీని.. బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో చూపించారు. కంటెస్టెంట్లందరికీ దిమ్మతిరిగి పోయేలా ప్రైజ్ మనీ అంటూ జీరో ని చూపించి.. ట్విస్ట్ ఇచ్చారు. ఆ తరువాత జీరో అంటే జీరో కాదనీ, ప్రైజ్ మనీ కూడా లిమిట్ లెస్, కంటెస్టెంట్స్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే అంత ప్రైజ్ మనీ ఇస్తామని ఖుషి చేశారు.

Bigg Boss Season 8 Abhay Naveen MASS warning to the contestants

ఇలా ట్విస్టుల మీద ట్వీస్టులు లిస్తూ... బిగ్‌బాస్ మీద భారీ అంచనాలు పెంచేందుకు స్టార్ మా ప్రొమోలను వీడియో బైట్స్ ను రిలీజ్ చేస్తుంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు .. షోపై క్యూరియసిటీని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా ఓ వీడియో బైట్ డే 1లో ఏం జరగబోతోంది, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో చూపించారు. ఈ చిన్న బైట్ లో పుడ్ కోసం.. కుకింగ్ ( వంట చేయడం)పై కంటెస్టెంట్ల మధ్యహాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నట్టు చూపించారు. అందులో పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్ రెచ్చిపోయాడు.

ఈ వీడియో బైట్ ప్రకారం.. కుకింగ్ విషయంలో కంటెస్టెంట్ల మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఎవరు వంట చేశారు. ఎవరికి వంట వచ్చు.. అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిత్య ఓం సలహా .. బెబక్క మరో సలహా ఇచ్చింది. అఖిల్ మరో సలహా ఇచ్చారు. చేపల మార్కెట్లో అరుస్తున్నట్టు.. పిచ్చిపిచ్చిగా ఒక్కరిపై ఒక్కరూ అరుచుకున్నారు.

Bigg Boss Season 8 Abhay Naveen MASS warning to the contestants

ఈ క్రమంలో అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చారు. వన్ సెకండ్ ఫ్లీజ్ అంటూ గట్టిగా అరేసి... మనం చిన్న బచ్చా గాళ్లలామా.. ఒక్కడు మాట్లాడితే.. మరొకరు సైలెంట్ గా ఉండాలి. ఆ తరువాత మరొకడు మాట్లాడాలి. మాట్లాడాలని భావించే వాళ్లు హ్యాండ్ రేజ్ చేయండి. ఎందుకు పిల్ల బచ్చాగా బీహెవ్ చేయకండి. అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఫస్ట్ డే ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: bigg boss season abhay naveen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X