Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ని తిట్టడానికి కారణం ఇదే! సంచలన విషయాలను బయటపెట్టిన అభయ్
Bigg Boss Buzz: బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఈ సీజన్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. గతంతో ఏ సీజన్ సాధించలేని టీఆర్పీతో దూసుకెళ్తోంది బిగ్ బాస్ సీజన్ 8. ఇప్పటివరకు విజయవంతంగా మూడో వారాలు కంప్లీట్ చేసుకుంది. మూడో వారం వన్ ఆఫ్ ది స్ట్రాంటెస్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ పై నోరుపారేసుకోవడం వల్లే తనను ఎలిమినేట్ చేశారని చాలామంది అనుకుంటున్నారు. కానీ, చీఫ్ గా అయినా తరువాత అభయ్‌లో ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయనే మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ను ఎలిమినేట్ అయిన బయటకొచ్చాక అభయ్ నవీన్ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ని తిట్టడానికి కారణమేంటో వివరించారు.
బిగ్ బాస్ ని ఎందుకు తిట్టారు. ఒక మనిషి పదిమందికి వంట చేయొచ్చు. అలాంటి ముగ్గురు ఆరుగురికి వంట చేయలేరా? అని ప్రశ్నించగా.. 'వాస్తవానికి చేయొచ్చు. కానీ. మూడు రోజుల నుండి మాకు సరైన తిండి లేదు. సడెన్ గా రేషన్ వచ్చింది. రేషన్ వచ్చిదేనని సంతోష పడే లోపే టైమర్ వచ్చింది. ఒక్క మనిషి పది మందికి ఎప్పుడు వండుతాడు. టైం లిమిట్ లేకపోతే వండుతాడు. ఎలాంటి కండీషన్స్ లేకుండా ఉంటే వండుతాడు. కానీ.. గంటలో వండుకోవాలంటే ఎలా ? అని సమాధానమిచ్చారు అభయ్.

' అయినా.. నేను తిడితే తిట్టినా అంటారు కానీ.. సరైనా పుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. హౌస్ లో రేపటి పుడ్ కూడా ఈ రోజే వండుకునే వాళ్లం. అలాంటి పుడ్ తినలేక ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడ్డారు. పుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నని తనకు చెప్పాడు. అందుకే బిగ్ బాస్ మీద రియాక్ట్ కావాల్సి వచ్చింది. దెబ్బ తగిలిన తరువాత అంటిమెంట్ పెట్టుకోవడం కంటే.. దెబ్బ తగలకుండా చూసుకోవడమే మేలు కాదా అనేది నా పాలసీ.. అంటూ సెటైరికల్ పంచ్ వేశారు అభయ్.
'కొన్ని ట్కాసులలో కంటెస్టెంట్లకు ఇబ్బంది పడుతున్నారన్నారు. అందులో ప్రేరణ పరిస్థితి మరి దారుణం. ఆమెకు చేతికి చాలా గాయాలయ్యాయి. దీంతో ఏ గేమ్ లో అయితే.. ఫిజికల్ వైలెన్స్ ఉంటే.. ఆ గేమ్ ఆడనని ముందే ఫిక్స్ అయ్యాను. కావాలంటే.. వేరే కంటెస్టెంట్లు ఆడుకుంటాంటే ఆడుకోండి అని తెగేసి చెప్పేశాను. ఆ సమయంలోనే నా కామెంట్స్.. నా ఓపినియన్ పై ఏమైనా అభ్యంతరాలున్నా.. తరువాత జరిగే పరిణామాలున్నా వాటిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పేశాను. అందుకే నన్ను ఛీప్ గా తీసేనంటే.. ఎందుకు తీసేశారని అసలు అడగలేదు. కారణం నేనే ఓపెన్ గా చెప్పేశాను అని అభయ్ డేర్ గా చెప్పేశారు.
'ప్రతి ఒక్కరికి ఓ స్ట్రాటజీ ఉంటుంది. అలాగే.. నేను కూడా డే వన్ నుండి నా స్ట్రాటజీ ప్రకారం ఆడాను. సంచాలక్ గా ఎవరైతే వ్యవహరిస్తారో వారు ముందుగానే గేమ్ రూల్స్ క్లియర్ గా చెప్పాలని నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. అంతకుముందుకు వేరే గేమ్ లో వారు తొండి ఆట ఆడితేనే.. బెలూన్ గేమ్ లో నేను బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆడాను. బాక్స్ లోనే ఉండాలా? లేదా ? అనే విషయాన్ని సంచాలక్ చెప్పలేదు. ఆ తరువాత నా మీద అరుస్తే.. నేనేందుకు ఊరుకుంటా..? నేనేందుకు సైలెంట్ గా ఉంటా..? ఏ గేమ్ లోనైనా స్ట్రాటజీతో ఆడాను. అయినా.. సాక్స్ గేమ్ లో తప్పు ఒప్పు ఏంటో చెప్పిన బిగ్ బాస్ బెలూన్ గేమ్ లో గేమ్లో ఎందుకు మధ్యలో చెప్పలేదు' ప్రశ్నించారు అభయ్.


Click it and Unblock the Notifications











