Shekhar basha: ఇంటి నుంచి వెళ్లిపో.. శేఖర్ భాషాకు భార్య షాక్
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటి వరకూ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే.. 90 పర్సెంటేజ్ పీపుల్స్ శేఖర్ బాషా (Shekhar baasha)అనే చెబుతారు. గడిచిన రెండువారాల్లో ఎక్కడైన ఫన్ జనరేట్ అయిందంటే.. అది శేఖర్ బాషా వలనే.. తన పంచ్‌లు, జోక్స్‌తో హౌస్ లోని సభ్యులను నవ్వించాడు. బీబీ లవర్స్ ను కూడా పుల్ ఎంటర్టైన్ చేశారు. నిజంగా తన నాన్ సింక్ పంచ్ లను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. అందులో బెస్ట్ వ్యూ అంటే ' ఐ లవ్ య్యూ', చిరాకు అంటే ఛీ.. రాకు అని ఇలా శేఖర్ బాషా చెప్పిన జోకులు నిజంగా సూపర్.. ఇంకా క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ ను రెండో వారమే ఎలిమినేటర్ బయటకు పంపించేశారు. ఇలా బయటకొచ్చాక శేఖర్ బాషా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లిడించారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత శేఖర్ భాషా వరసగా ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీగా మారారు. బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్లే.. నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపో అందని శేఖర్ బాషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందన్నారు. తన భార్య డెలివరీ ముందు మూడు రోజులు ఏదో ఆందోళనకు గురయ్యాననీ, అందుకే ఎలిమినేషన్ అయి బయటకొచ్చానని శేఖర్ బాషా చెప్పాడు. కానీ, తీరా ఇంటికి వెళ్లాక తన భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపోమని అందనీ, కనీసం నువ్వు టాప్-5 లో ఉంటావని అనుకుందట, కానీ ఇలా చేశావంటూ ఫిల్ అయ్యిందని,ఎలిమినేట్ అయ్యానని తెలిసి తాను చాలా ఏడ్చేసిందంట అని శేఖర్ బాషా అన్నారు. కానీ తనకు బాబుని ఎత్తుకున్న ఆ సంతోషం చాలని అన్నారు.

బిగ్ బాస్ కి వెళ్లడం కోసమే ఇలా రాజ్ తరుణ్ ఇష్యూలో రైజ్ చేశారని కొంతమంది అన్నారు నిజమేనా అని ప్రశ్నించగా.. 'అదేం లేదు. వాస్తవానికి నేను వెళ్తానో.. లేదో.. విషయం కూడా అసలూ క్లారిటీ కూడా లేదు ' అన్నారు శేఖర్ బాషా. 'డెలివరీ దగ్గర్లో ఉంది వెళ్ళాలా? వద్దా? అని తన భార్యని అడిగినప్పుడు.. ఆమె ఓ రోజంతా ఆలోచించి వెళ్ళమని చెప్పింది. ఆ వారం ముందు వరకు అసలు తెలియదు. బిగ్ బాస్ టీమ్ చేసిన ఇంటర్వ్యూ సమయంలో కూడా తన భార్య డెలివరీకి వన్ డే పర్మిషన్ కావలి లేదా వారినే చూపించాలి అన్నాను. అందుకు వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారంటు శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు.
ఇక బిస్ బాస్ స్క్రిప్టేట్ షో నా అని ప్రశ్నించగా.. 'లేదు. అసలూ కాదు. ఎలిమినేషన్ కూడా వారి చేతిలో కూడా లేదు. ' అని బదులిచ్చారు. కానీ, బీబీ లవర్స్ తన కూడా సపోర్టు చేయపోవడం కాస్తా బాదేసింది. కానీ.. నేను బయటకు రావడమే కరెక్ట్ అన్నారు. ఏ తండ్రికైనా ఓ కొడుకు పుట్టినప్పుడూ కొన్ని పర్మాలిటీస్ ఉంటాయి వాటిని పుల్ ఫీల్ చేయడం తండ్రి బాధ్యత. అందుకోసమే నేను బయటకు రావాలని గట్టిగా అనుకున్నా..' అన్నారు. బిగ్ బాస్ వెళ్లే వారికి నాలాంటి పరిస్థితి వస్తే మాత్రం.. వారికి కనీసం ఒక్క రోజైన బయటికి వెళ్లి వచ్చేలా అవకాశం కల్పించాలని బిగ్ బాస్ టీం కు రిక్వెట్ చేశారు.
ఆ తరువాత శేఖర్ బాషా పుడ్ గురించి మాట్లాడుతూ.. 'హౌస్ లో అందరు నాన్ వెజిటేరియన్స్.. అందులో నేను ఒక్కడినే వెజిటేరియన్. వాళ్ళు ఎగ్, చికెన్ కర్రీస్ చేసుకుంటే.. నాకు ఒక్కడికే సపరేట్ గా చేయమని చెప్పలేక.. గట్టిగా అడగలేను. ఒక్కో రోజు క్యాబేజీ, క్యారెట్ ముక్కలు, అలా పచ్చి కూరగాయాలు తినేవాడిని. విటమిన్ పౌడర్ ఉండేది కాబట్టి సరిపోయేది.అందరికి ఎగ్ ఉంది కానీ నాకే సిగ్గు లేదన్నారు శేఖర్ బాషా. బిగ్ బాస్ వాళ్ళు పుడ్ విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని అన్నారు.

ఇక కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ..బిగ్ బాస్ లో నేను ట్కాసులు,వాళ్లు పెట్టే గేమ్ మాత్రమే ఆడాను. కానీ, కుళ్లు కుతంత్రాలతో మైండ్ గేమ్ ఆడలేదు అన్నారు. వాస్తవానికి అక్కడి వెళ్లే వరకు ఎవరు వస్తున్నారో తెలియదు. కేవలం బేబక్క వస్తుందనే టాక్ వచ్చింది. మిగిత వారితో ముఖపరిచయం కూడా లేదన్నారు. బిగ్ బాస్ హౌస్ లో అందరికి కంటే.. నబిల్ చాలా దగ్గరయ్యారు. ప్రతి విషయాన్ని మేము ఇద్దరం షేర్ చేసుకునే వారిమి. ఇద్దరం కలిసి కుకింగ్ చేయడం . ఫ్యామిలీ, కెరీర్ గురించి ఇద్దరం షేర్ చేసుకున్నాం. మిగిత కంటెస్టెంట్లు కూడా క్లోజ్ గా ఉన్నార కానీ.. నబిల్ ఎక్కువ.' అని పేర్కొన్నారు.
బిగ్ బాస్ లో శేఖర్ బాషా ఉగ్రరూపాన్ని చూస్తామని చాలా మంది అనుకున్నారు. మీరు మాత్రం సైలెంట్ గా ఉంది పోయారు ఎందుకు ప్రశ్నించగా.. ' నేను ఎక్కడ చెప్పలేదు. నాలో వైల్డ్ యాంగిల్ ను చూపిస్తాననీ, కేవలం నాలోని చిలిపి చేష్టాలను చూపించడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాను' అని క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ లో తనకు ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. తనకు మూడు కోట్లు ఇచ్చారనీ.. కానీ అవి చాలా టైట్ గా ఉన్నాయని వ్యంగంగా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











