నానికి కింగ్ నాగ్ బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు తన భుజాలపై వేయొద్దని రిక్వెస్ట్ ..
Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎవ్వరూ ఎక్జ్స్ పెక్ట్ చేయని విధంగా ట్వీస్టుల మీద ట్వీస్టులు ఇస్తున్న ఈ సీజన్ లో స్పెషల్ గా వచ్చిన హీరో నానికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు కింగ్ నాగ్. ఈ ఆఫరేంటో మీరు కూడా చూడండి..
ఈ రోజు బీబీ హౌస్ లోకి 14 మంది అడుగుపెట్టనున్నారు.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు.. అది కూడా జంటగా వెళ్తున్నారు. బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున చాలా ఎనర్జీ గా అమ్మాయిలతో రొమాంటిక్‌గా దేవర పాటతో షోలో ఎంటర్ అయ్యారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ్ ఇంటిలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తరువాత నిఖిల్ మిలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ, హీరో ఆదిత్య, సోనియా, బేబక్క కామెడీ, శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు.

అలాగే ఈ సారి లాంచింగ్ ఈవింగ్ లో స్పెషల్ గెస్టుల లిస్టు కూడా చాలానే పెద్దగానే ఉంది. ఈ గ్రాండ్ లాంచింగ్ ఈవింగ్ లో 'సరిపోదా శనివారం' హీరో హీరోయిన్లు నాని, ప్రియాంక మోహన్ సందడి చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తాను అనవాయితీగా వస్తున్నారని అన్నారు. ఆ తరువాత కల్లు... కల్లు.. అంటూ.. హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా క్యూట్ గా పిలిచారు. ఇంత క్యూట్ గా పిలిస్తే.. రాకుండా ఉంటుందా? అంటూ నానికి కింగ్ సైటైర్ వేశారు. ఇక హీరోయిన్ ఎంట్రీలో షో మరింత గ్లామరెస్ గా మారిపోయింది. ఈ క్రమంలో హీరోయిన్ ప్రియాంకను ఇరకాటంలో పడేశాడు కింగ్ నాగ్.
ఆ తరువాత ఓ క్లిష్టమైన ప్రశ్న వేసి.. 'సరిపోదా శనివారం' సూపర్ హిట్ అయిందిగా.. మరీ హీరో నాని పర్మామెన్స్ కి ఎన్ని మార్కులు ఇస్తావని కింగ్ నాగ్ అడగ్గా.. వందకు వంద మార్కులిస్తా అంటూ చెప్పేసింది. మరి విలన్ గా నటించిన ఎస్.జె. సూర్య గారికి సంగతి ఏంటి? ఆయనకు ఎన్ని మార్కులిస్తావ్ అని నాని అడుగుతే.. ఆ క్యూట్ బ్యూటీ చాలా తెలివిగా సమాధానం ఇస్తూ.. నానికి వందకు వంద ఇస్తే.. సూర్య గారికి వందకు '101' మార్కలేస్తానంటూ సమాధానం ఇచ్చింది. వెంటనే నాని స్పందించి.. ఎస్ జే సూర్యకు తాను ఇంకో పది మార్కులు కలిపి 110 మార్కులిస్తానని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
నాని కి కింగ్ బంపర్ ఆఫర్..
ఆ తరువాత హోస్ట్ నాగ్ హీరో నానికి క్రేజీ ఆఫర్ ఇచ్చారు. తన కోసం ఓ చిన్న పని చేయాలంటూ.. తాను ఓ నాలుగు వారాలు హాలీడేకు ఫారెన్ వెళ్తున్నననీ, ఆ సమయంలో బీబీ హోస్ గా చేయమని ఆఫర్ చేశారు. వెంటనే నాని మాట్లాడుతూ 'సార్.. సార్.. ఆ ఒక్కటి తప్పతే.. అలాంటి బాధ్యతలు తన భుజాలపై వేయవద్దు. మీరు హోస్టింగ్ అంటే.. గోస్ట్ లా మయం అవుతా 'అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు.
ఆ తరువాత 'సరిపోదా శనివారం' హీరో హీరోయిన్లు నాని, ప్రియాంక మోహన్ లను హౌస్ లోకి పంపించారు. అక్కడ కంటెస్టెంట్ల ఎగ్జైట్మెంట్ చూసి.. 'నాకు మీ ప్యూచర్ అర్థం అవుతుంది' అంటూ బీబీ కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు. ఆ తర్వత బేబక్క, శేఖర్ బాషా, ఆదిత్య, సోనియాలతో ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడించారు. రియల్ గా ఈ సీజన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది భయ్యా..


Click it and Unblock the Notifications











