Bigg Boss: గేమ్ చేంజర్ అవినాష్.. డబుల్ ఎలిమినేషన్స్..టెస్టీ తేజాతో పాటు మరో కంటెస్టెంట్ అవుట్..

Bigg Boss 8 Telugu 13th Week Elimination: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఎక్కడ చూసినా బిగ్ బాస్ ప్రస్తావననే. బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఎన్నడూ ఊహించని, ఎప్పుడు చూడని కంటెంట్ ఇవ్వడంతో బిగ్ బాస్ లవర్స్ నుండి మంచి ఆదరణ వస్తుంది. ట్వీస్టులు, మలుపులతో కంటెస్టెంట్లకే కాకుండా ప్రేక్షకులకు కూడా షాక్లిస్తున్నారు బిగ్బాస్ టీం. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 ప్రస్థానం ముగిసిపోతుండటంతో బిగ్ బాస్ నుండి ఈ వారం (13 వారం) ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. టాప్ 5 రేసుకు ఎవరు పోటీ పడబోతున్నారనేది చర్చనీయంగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు.. ఫ్యామిలీ ఎపిసోడ్ నుండి బిగ్ బాస్ సీజన్ స్వరూపమే మారిపోయిందనే చెప్పాలి. అప్పటివరకు హీరోలుగా ఉన్న కంటెస్టెంట్లు జీరోలుగా.. జీరోలుగా ఉన్న కంటెస్టెంట్లు హీరోలుగా మారారు. ఎవరు ఊహించని విధంగా పర్ఫామెన్స్ ఇస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. టాప్ 5 రేసులో నిలుస్తామని విర్రవీగిన కంటెస్టెంట్ల ఆశలకుపై నీళ్లు చల్లారు. గతవారం ఎవరు ఊహించని విధంగా పృద్విని ఓడించి రోహిణి మెగా చీప్ గా సెలెక్ట్ అయింది. దీంతో పృద్వి గేమ్ డేంజర్ లో పడింది.

Bigg Boss season 8 Telugu 13 week double elimination Tasty Teja and Prithviraj Shetty will eliminate

ఇక బిగ్ బాస్ గేమ్ కు పెద్దన్నగా నిలిచిన నిఖిల్ కు షాక్ తగిలింది. నిఖిల్ ను ఓడించి.. ముక్కు అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముక్కు అవినాష్ వీరవిహారంతో టాప్ 5 కంటెస్టెంట్ల జాబితా పూర్తిగా మారిపోయింది. ఈవారం లీస్ట్ ఓటింగ్ తో ఉన్న అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకోవడంతో డైరెక్ట్ గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల జాబితాలోకి వెళ్లిపోయాడు అని చెప్పాలి. ఇక వారం మెగా చీప్ రోహిణి తప్ప అందరూ నామినేషన్లో నిలిచారు.

ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ప్రకారం.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణలు టాప్ పొజిషన్ లో ఉన్నారు. దాదాపు వీరికి టాప్ 5 బెర్తులు కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తుంది. ముక్కు అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకోవడంతో పృద్వి, విష్ణు ప్రియ, రోహిణి, టేస్టీ తేజల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పటివరకు అందిన ఇన్పుట్స్ ప్రకారం టేస్టీ తేజ లిస్ట్ స్థానంలో ఉండటంతో శనివారం ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక డేంజర్ జోన్ లో ముక్కు అవినాష్, పృథ్వి రాజ్ శెట్టి నిలిచారు.

Bigg Boss season 8 Telugu 13 week double elimination Tasty Teja and Prithviraj Shetty will eliminate

గత సీజన్లో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. టాప్ 5 లోకి వెళ్తాడని భావించిన గౌతమ్ కు అంబటి అర్జున్ షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ లో అంబటి టికెట్ టు ఫినాలే గెలుచుకొని డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లిస్టులోకి వెళ్లిపోయాడు. దీంతో ఆ వారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం సీజన్ లో కూడా ఇదే పరిణామం చోటు చేసుకోబోతుంది. ముక్కు అవినాష్ ఓటింగ్ పరంగా జాబితాలో లిస్ట్ లో ఉన్న.. టికెట్ టు ఫినాలే గెలుచుకోవడంతో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు.. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న పృద్వి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ పృథ్వి కనుక ఈ వారం ఎలిమినేట్ అయితే.. 13 వారాల పృద్వి - విష్ణుప్రియ ల లవ్ స్టోరీకి బ్రేకులు పడినట్లు అవుతుంది. మిగిలింది రెండు వారాలే కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్. 14వ వారం మిడ్ బిగ్ ఎలిమినేషన్ తో పాటు చివరి వారం మరో ఎలిమినేషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తున్నాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X