Bigg Boss: వాళ్ల హీరోలు.. మీరు కమెడియన్లు.. హౌస్ లో భయపెట్టేది ఎవరు? తేజ షాకింగ్ కామెంట్స్
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఎన్నడూ చూడని ట్విస్టులు, మలుపులతో సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. హైయెస్ట్ టిఆర్పి తో దూసుకుపోతున్న ఈ సీజన్ 13వ వారం అనూహ్యంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన టేస్టీ తేజ.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ.. అంబటి అర్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ బజ్ ప్రోమో లో .. లింగు లింగు లింగిడి 'అనే సాంగ్ కు టేస్టీ తేజ అండ్ అంబటి అర్జున్ లు మాస్ స్టెప్పులస్తూ.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అంబటి అర్జున్ తన ప్రశ్నలతో ఎన్ కౌంటర్ ప్రారంభిస్తాడు.

తాను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేస్తా.. కొన్ని స్పెషల్ క్యూస్షన్స్ ప్రిపేర్ చేశానంటూ.. అంబటి అర్జున్ తన బ్లేజర్ లోపల నుండి క్వశ్చన్ కార్డ్స్ బయటికి తీశాడు.దీంతో టేస్టీ తేజ షాక్ అవుతాడు 'ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టినట్టు.. నువ్వేంటన్న క్వశ్చన్స్ అక్కడ పెట్టావు' అంటూ పంచ్ వేస్తాడు. ఆ తరువాత 'నేను అడగబోయే ప్రశ్నలకు ప్యూర్లీ.. మై పాయింట్ అఫ్.. ఇట్ మై ఓపినియన్.. మై పర్సనల్ ఒపీనియన్ ' అంటూ టేస్టీ తేజ డైలాగును చెప్పి ఈ పదాలను ఉపయోగించకుండా సమాధానాలు చెప్పాలంటూ.. కండిషన్ పెడతాడు అంబటి అర్జున్. దీనికి టేస్టీ తేజ కూడా సరే అంటాడు.
ఆ తరువాత అంబటి తన ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. 'నేను 15వ వారంలో స్టేజ్ మీద ఉంటానన్న టేస్టీ తేజ.. ఇప్పుడు నా ముందు ఉండడానికి కారణం ఏంటి? ఆ ఫైర్ తగ్గడానికి కారణం ఏంటి? ' అంటూ ఘాటైన ప్రశ్న వేస్తాడు అంబటి అర్జున్. దీనికి టేస్టీ తేజ సమాధానం ఇస్తూ.. ' బిగ్ బాస్ హౌస్ లో ఒకటి హీరోహిక్ కేటగిరి.. రెండవది కమెడియన్ కేటగిరి' అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. దీంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'వాళ్లు హీరోలు.. మీరు కమెడియన్లు' అనే అపోహ తప్పు అంటాడు. కానీ ఆ సమాధానాన్ని టేస్టీ తేజ ఒప్పుకోడు.
'ఇదే కరెక్ట్.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. ఇదే నిజం' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు తేజ. 'నీ అతి తెలివి నీ అమాయకత్వం' అంటూ కామెంట్ చేస్తాడు అర్జున్. ' హౌస్ లో వాళ్ల ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కామెంట్ చేశావ్.. మరి మీ ముగ్గురు ఆడింది గ్రూప్ గేమ్ కాదా? అంటూ దిమ్మతిరిగే ప్రశ్న వేశాడు అంబటి. దానికి టేస్టీ తేజ సమాధానమిస్తూ.. తమ తప్పులను తెలుసుకొని ఆడాం తప్ప మేము గ్రూప్ గేమ్ ఆడలేదు' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు.
' హౌస్ లో ప్లైన్ దోస వర్సెస్ చీస్ దోస అనే వార్ జరుగుతుంది. ఆ వార్ ను రగిలించింది.. మరిగించింది.. మరింత ఉప్పు వేసింది నువ్వు..' అంటూ సంచలన కామెంట్ చేస్తాడు అంబటి. దీనికి టేస్టీ తేజ సమాధానమిస్తూ.. 'రోహిణి గారు అడిగినప్పుడు మరొక దోస వేసిస్తే ఏమవుతుందని మాత్రమే తాను అడిగానని, దాంట్లో వచ్చే సమస్య ఏం లేదని ఇదే నా పాయింట్ 'అంటూ తనను తాను కవరింగ్ చేసుకుంటాడు తేజ.
'టేస్టీ తేజ హౌస్ లో తేజ కొంతమందికి భయపడ్డాడు. అది నిజమా? కాదా? అని ప్రశ్నించగా..' తాను భయపడే వాడినైతే .. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మాట్లాడింది నేను' బదులిస్తాడు. 'మరీ వాళ్ల ముగ్గురిదీ గ్రూప్ గేమ్ అనడానికి మీ ముగ్గురిది గ్రూప్ గేమ్ కాదు.. అనడానికి ఒక్క రీజన్ చెప్పు' అంటూ అంబటి అర్జున్ వేస్తాడు. దానికి టేస్టీ తేజ రిప్లే ఇస్తూ.. 'నేను చేసింది తప్పని నిఖిల్ చెప్పాడు. అదే యశ్మీ చేసింది తప్ప కాదా అని ప్రశ్నించగా.. నేను చూడలేదు అంటూ తప్పించుకున్నాడు' అని ఫైర్ అయ్యారు తేజ.
'హౌస్ ఇన్ఫాక్ట్ అయ్యింది నువ్వు గుడ్డు వేయడం వల్లనే కదా' అంటూ మరో స్ట్రాంగ్ కామెంట్ చేస్తాడు అంబటి. టేస్టీ తేజ కూడా.. 'అది నా గేమ్ అన్నా' అంటూ తనదైన స్టైల్ లో సమాధానమిస్తాడు టేస్టీ తేజ. 'నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు కరెక్టే పక్క వారు కూడా తమ తప్పును ఒప్పుకోవాలనేడం కరెక్ట్ కాదు కదా.. అని అంబటి అర్జును అనడంతో.. 'తప్పు ఒప్పుకోవడం రైట్.. కానీ తప్పు చేసి తప్పు కాదనడం. అది పెద్ద తప్పు' అంటూ గట్టిగా అరుస్తారు టేస్టీ తేజ. ఇలా దిమ్మతిరిగే ప్రశ్నలు.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్లతో టేస్టీ తేజ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కొనసాగింది.


Click it and Unblock the Notifications











