మూడో బ్యాడ్ న్యూస్ అంటూ.. దిమ్మతిరిగే పోయే ప్రైజ్ మనీ..

Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‎బాస్‏ సీజన్ 8 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ట్వీస్టుల మీద ట్వీసులు ఇస్తూ ప్రారంభమైన సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు. ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు.. జంటగా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున చాలా ఎనర్జీ గా అమ్మాయిలతో రొమాంటిక్‌ సాంగ్ కు స్టెప్పులేస్తూ.. ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత యష్మీ గౌడ్ - నిఖిల్ మిలియక్కల్, అభయ్ నవీన్ - ప్రేరణ, హీరో ఆదిత్య -సోనియా, బేబక్క కామెడీ -శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు.

ఇదేం ప్రాంక్ భయ్యా..

అలాగే ఈ సారి లాంచింగ్ ఈవింగ్ లో స్పెషల్ గెస్టుల లిస్టు కూడా చాలానే పెద్దగానే ఉంది. మరో స్పెషల్ గెస్ట్ గా.. అనిల్ రావిపూడి పంపించారు. ఆయన హౌస్లో కి ఎంటర్ అవుతూనే.. ఆమె మాత్రం పది వారాలు ఉంటారంటూ బేబక్కపై సైటైర్ వేశారు. ఆ తరువాత ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో హౌస్ మెట్స్ లో చాలామంది నాగమణిని నామినేట్ చేశారు. దీంతో నాగమణిని అనిల్ హౌస్ బయటకు తీసుకెళ్లారు. దీంతో అందరూ షాక్ అయ్యారు . నాగమణి కంఠ కూడా ఓ రేంజ్ లో ఎమోషనల్ అయ్యారు. ఆ ఇది ప్రాంక్ భయ్యాంటూ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. ఆ తరువాత కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడిచి వెళ్లిపోయారు.

Bigg Boss season 8 third bad news

మూడో బ్యాడ్ న్యూస్..

కంటెస్టెంట్స్ అందరికీ వెల్ కం చెబుతూ.. ఈ సీజన్ లో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనీ, రోజు మీరు చూసింది కేవలం టీజర్ మాత్రమేననీ, పుల్ సినిమా రాబోయే రోజుల్లో ఉందని, అదికూడా ఎలాంటి ఇంటర్వెల్ లేకుండా అంటూ వార్నింగ్ ఇచ్చేశారు బిగ్ బాస్. ఆ తరువాత మూడో బ్యాడ్ న్యూస్ అంటూ కంటెస్టెంట్లను యాక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లారు బిగ్ బాస్. అక్కడ ఓ బ్యాక్ ను చూపించి.. బిగ్ బాస్ షో ప్రైజ్ మనీ అంటూ 'జీరో'ను చూపించి.. దిమ్మతిరిగి పోయే షాకిచ్చారు.

ఆ తరువాత నిదానంగా అసలూ విషయాన్ని వెల్లడించారు. జీరో ఎప్పటికీ జీరోలా ఉంటుందని కాదనీ, మీరు చేసే ప్రయత్నాలు ఆ ప్రైజ్ మనీని లిమిట్ లెస్ గా మారుతుందని అసలు విషయాన్ని బయటపెట్టారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్ ఫేస్ లోకి స్టైల్ వచ్చింది. ఈ సీజన్ లో అన్ని లిమిట్ లేస్ గా ఉంటాయనీ, మీరు ఎంత సంపాదించుకుంటారో అనేది మీ చేతుల్లోనే ఉంది. దానికి ఆకాశమే హద్దు. మీరు మనస్పూర్తిగా ఆడుతూ.. ఆ ప్రైజ్ మనీ పెంచాలని సలహా ఇచ్చారు. ఇలా మొత్తానికి మూడో బ్యాడ్ న్యూస్ అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

More from Filmibeat

Read more about: bigg boss telugu 8 nagarjuna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X