Remuneration: బిగ్‌బాస్‌లో స్టార్ కమెడియన్ జబర్దస్త్ అవినాష్ రెమ్యునరేషన్ ఏంతో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం నుంచే అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనీ, ఊహించని విధంగా ట్వీస్టులుంటాయని నాగార్జున చెప్పుతూనే ఉన్నారు. నాగార్జున చెప్పినట్టుగానే ఈనాడు ఆదివారం రోజు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. దీనితో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ ఈవెంట్ నిర్వహించారు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ పాత కంటెస్టెంట్లను లోపలికి పంపించి.. గేమ్ స్వరూపాన్నే మార్చేశారు. ఈ తరుణంలోవైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో స్టార్ కమెడియన్ ముక్కు అవినాష్ రెమ్యూనరేషన్ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభంలో అంతగా ఆసక్తికరంగా లేకుండే.. కానీ, ఈ రియాల్టీ షో క్రమంగా జోరందుకుంది. గత సీజన్లో చూడని ట్వీస్టులను ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి. ఏ సీజన్లో చూడని ట్విస్టులు ఈ సీజన్లోనే కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపి ఇక చూసుకోండి అన్నట్లుగా సీజన్ స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) అని , వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా విభజించారు. ఈ వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ముక్కు అవినాష్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు ముక్కు అవినాష్. చిన్న కామెడీ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ క్రమంగా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ.. టీం లీడర్‌గా ఎదిగాడు. తన టాలెంట్ ను గురించిన బిగ్‌బాస్ టీం నాలుగో సీజన్‌లో పాల్గొనడానికి ఆఫర్ వచ్చింది. ఈ సమయంలో కామెడీ షో నిర్వాహకులతో చేసుకున్న అగ్రిమెంట్ క్లోజ్ చేసి.. రూ.10 లక్షలు కట్టి బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు ముక్కు అవినాష్.
ఆ సమయంలో సుమారు 10 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ముక్కు అవినాష్ అప్పట్లో 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కెరియర్ లో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పలు ప్రోగ్రామ్ కు యాంకర్ గా, కొన్ని షోల్లో కంటెస్టెంట్ గా బిజీగా ఉన్నారు.తాను ఎంటర్‌టైనర్ అని నిరూపించుకున్నాడు.

ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ టీం మరో అవకాశాన్ని కల్పించడంతో వెంటనే ఈ కార్యక్రమానికి ఓకే చెప్పారని తెలుస్తుంది. ఇలా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు ముక్కు అవినాష్. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం కోసం బీబీ మెనేజ్ మెంట్ భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన డిమాండ్ ప్రకారం.. ముక్కు అవినాష్ ఒక వారం పాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఎన్నిరోజులు హౌస్ లో కొనసాగుతారు. టైటిల్ గెలుచుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











