Bigg Boss Telugu 8: యంగ్ కంటెస్టెంట్లతో పోటీ గంగవ్వ.. రెమ్యునరేషన్ కూడా తగ్గేదేలే!
Bigg Boss Season 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభంలో ఎవరూ అంత ఆసక్తి చూపని ఈ షో క్రమంగా జోరందుకుంది. గత సీజన్లో చూడని ట్వీస్టులను ఈ సీజన్ లో చూస్తున్నారు. ఏ సీజన్లో లేని విధంగా సీజన్ 8లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ సారి ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపి ఇక చూసుకోండి అన్నట్లుగా గేమ్‌ని మార్చేశారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) అని , వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా పేరు పెట్టారు. వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో గంగవ్వ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ గంగవ్వకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే విషయాలపై ఓ లూక్కేయండి.
అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పుల్ జోష్ నింపాడు. హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిని ఢీకొట్టడం కోసం మరో ఎనిమిది మందిని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్స్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసినవారినే వైల్డ్ కార్డు ద్వారా మరోసారి బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, నయని పావని, మెహబూబ్, ముక్కు అవినాష్, గంగవ్వ లు మరోసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి, బిగ్ బాస్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

ఇంతలో గంగవ్వ గురించి ప్రత్యేకంగా ప్రస్తవించాలి. వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. అక్షర ముక్క కూడా తెలియకుండా అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా అంటే ఏంటో తెలియకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారింది. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ 4లో ఎంటర్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. అయితే.. ఆ సీజన్లో గంగవ్వ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ సీజన్ మధ్యలో నుండి ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.
ఈ సారి బిగ్ బాస్ రీ లాంచ్ షోలే ఓ కొత్త లూక్ లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. హౌస్ లోకి ఇలా అడుగుపెట్టిందో లేదో .. తగ్గదేలే అన్నట్టుగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్క్ ఆడి గెలిచింది గంగవ్వ. దీంతో ఇంప్రెస్ అయినా బిగ్ బాస్. స్పెషల్ పవర్ ను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయమే.. అటు రోహిణీకి, ఇటు మణికంఠలకు ఝలక్ ఇచ్చింది. మణికంఠ కు మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరోసారి ఏడిస్తే.. నామినేట్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక రోహిణిని ఓ రేంజ్ లో ఆడుకుంది. ఇలా మిగితా కంటెస్టెంట్‌లతో చాలా హుషారుగా మాట్లాడుతూ తన ప్రయాణం సాగించింది గంగవ్వ.

ఈ షోలోని ఇతర కంటెస్టెంట్లకు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే.. గంగవ్వ మీద ఒక్క నెగెటివ్ కామెంట్స్ కూడా రాలేదు. పైగా గంగవ్వ నా మాజకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో గంగవ్వ రెమ్యూనరేషన్ సంబంధించిన విషయం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గంగవ్వకు వారానికి 3.5 లక్షల రూపాయాలు అందిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











