సీక్రసీ అంటే బిగ్‌బాసే.. మూడో కంటికి కూడా.. 70 కెమెరాలు.. 106 రోజులు..
Recommended Video

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో ఫీవర్ మొదలైంది. మొదటి సీజన్‌లో కిక్కు లభించడంతో రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్‌బాస్2 షో జూన్ 10న ప్రారంభం కానున్నది. బిగ్‌బాస్ సీజన్2కు సంబంధించిన పత్రికా సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాని, స్టార్ మాకు చెందిన అలోక్ జైన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలోక్ జైన్, నాని మాటల్లోనే..

25 శాతం మేర భారీ సెట్
గతంలో బిగ్‌బాస్ ఒకటో సీజన్ కోసం ముంబైకి సమీపంలోని లోనావాలాలో భారీ సెట్ వేశాం. రెండో సీజన్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సినీ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను రూపొందించాం. ఒకటో సీజన్‌తో పోల్చుకొంటే బిగ్‌బాస్ సెట్ సుమారు 25 శాతం పెద్దది.

నాలుగు నెలలుగా సెట్ నిర్మాణం
బిగ్‌బాస్2 కోసం గత మూడు, నాలుగు నెలలుగా కఠినంగా శ్రమించాం. ఈ సీజన్ కోసం రూపొందించిన సెట్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

అత్యంత సీక్రెట్‌గా పనులు
బిగ్‌బాస్‌లో అన్ని విషయాలు అత్యంత స్రీకెట్‌గా ఉంటాయి. అదే ఈ షోకు ప్రాణం. బిగ్‌బాస్ కోసం చాలా జట్లు పనిచేస్తాయి. ఒక బృందం చేసే పని మరో బృందానికి తెలియదు. అలాంటి ప్లానింగ్‌తో బిగ్‌బాస్ నడుస్తుంది. పూర్తి స్థాయి సమాచారం ఏ ఒక్కరి వద్ద ఉండదు అని తెలిపారు.

పూర్తి సమాచారం ఏ ఒక్కరి వద్దా
బిగ్‌బాస్‌లో పాల్గొనే సెలబ్రిటీల అందరి వివరాలు ఏ ఒక్కరి వద్దా ఉండవు. చివరి నిమిషం వరకు బిగ్‌బాస్ టీం ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. టాప్, మిడిల్ లెవెల్ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతుంటారట.

70 కెమెరాలు.. 106 రోజులు
జూన్ 10న ప్రారంభమయ్యే బిగ్‌బాస్2 106 రోజులపాటు సాగుతుంది. 16 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. 70 కెమెరాలు నిర్విరామంగా పనిచేస్తాయి. మూడు నెలలకు పైగా జరిగే షోలో ప్రతిక్షణం ఏదైనా జరుగొచ్చు అని నిర్వాహకులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











