బిగ్ బాస్ మరో సంచలన నిర్ణయం: ఆ కంటెస్టెంట్ రీఎంట్రీపై ఊహించని విధంగా!

ఎన్నో మలుపులు.. మరెన్నో ఊహించని సంఘటనలతో ప్రసారం అవుతూ సూపర్ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్ షో. బయటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రసారం అయినా ఏమాత్రం రెస్పాన్స్ తగ్గకుండా సాగుతోంది. అందుకే తెలుగులో వరుసగా సీజన్లను నడిపిస్తున్నారు షో నిర్వహకులు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ ఎన్నో ట్విస్టులతో సాగుతోంది. గతంలో చూడని ఎన్నో అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ విషయంలో బిగ్ బాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

సూపరు హిట్టూ... బిగ్ బాస్ హిట్టు

సూపరు హిట్టూ... బిగ్ బాస్ హిట్టు

ఎన్నో అనుమానాల నడుమ వచ్చింది బిగ్ బాస్ షో. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్, నేచురల్ స్టార్ నాని నడిపిన రెండో సీజన్, నాగార్జున సారథ్యంలో వచ్చిన మూడో సీజన్‌లు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ షో బుల్లితెరపై ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అంతేకాదు, భారతదేశంలో ప్రసారం అవుతోన్న భాషలన్నీంటిలోనూ నెంబర్ స్థానం దక్కించుకుంది.

వాటితో పోల్చితే ఇది స్పెషల్ సీజన్

వాటితో పోల్చితే ఇది స్పెషల్ సీజన్

గత వాటితో పోల్చితే ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 ప్లస్ రేటింగ్ రావడంతో ఇండియన్ టెలివిజన్ రికార్డులు బద్దలయ్యాయి. ఆ తర్వాత కూడా షో మంచి స్పందనతోనే సాగుతోంది. అంతేకాదు, గతంలో కనిపించని ఎన్నో టాస్కులు, లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలు, గొడవలు వంటివి ఈ సీజన్‌లో దర్శనమిస్తున్నాయి.

 బిగ్ బాస్ యూనిట్ డేరింగ్ డెసీషన్

బిగ్ బాస్ యూనిట్ డేరింగ్ డెసీషన్

ఈ సీజన్‌ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. అయినప్పటికీ షోపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ యూనిట్ డేరింగ్ స్టెప్పులు వేస్తోంది. సీజన్ ఆరంభంలోనే ముగ్గురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించారు. అలాగే, సీక్రెట్ రూమ్ టాస్కులను తీసుకొచ్చారు. వీటితో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వంటి కొన్ని సరికొత్త ప్రయోగాలతో షోను రంజుగా నడుపుతున్నారు.

కంటెస్టెంట్ రీఎంట్రీపై ఊహాగానాలు

కంటెస్టెంట్ రీఎంట్రీపై ఊహాగానాలు

నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గానే సాగుతున్నప్పటికీ.. దీనికి మరింత రెస్పాన్స్ తీసుకు రావాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దేవీ నాగవల్లి, నోయల్, కుమార్ సాయి పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ మరో సంచలన నిర్ణయం

బిగ్ బాస్ మరో సంచలన నిర్ణయం

బిగ్ బాస్ హౌస్‌లోకి కుమార్ సాయి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అతడు ఇప్పటికే షో నిర్వహకులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు వచ్చాడని కూడా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నోయల్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యూనిట్ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట.

Recommended Video

Divi Vadthya Pic Goes Viral In Social Media
రీఎంట్రీపై ఊహించని విధంగా ప్లాన్

రీఎంట్రీపై ఊహించని విధంగా ప్లాన్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. మరో మూడు వారాల్లో ఫైనల్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటెస్టెంట్‌ రీఎంట్రీపై యూటర్న్ తీసుకున్నారని సమాచారం. ఎలాగో ఏడుగురే ఉన్నారు కాబట్టి.. షో కూడా మంచి స్పందనతోనే రన్ అవుతోంది కాబట్టి రీఎంట్రీ విషయాన్ని పక్కన పెడదామని బిగ్ బాస్ యూనిట్ డిసైడ్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X