Bigg Boss Telugu 7: ఫినాలే ముందు బిగ్ ట్విస్ట్.. వారం ముందే విన్నర్ డిసైడ్.. షో చరిత్రలో తొలిసారిగా!
తెలుగు బుల్లితెరపై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనంగా మారిన ఏకైక షోనే బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతున్నప్పటికీ.. మన ప్రేక్షకులు దీన్ని బాగా ఆదరిస్తున్నారు. ఈ కారణంగా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడో దానిని కూడా ఘనంగా ముగించబోతుంది. మరో వారంలోనే ఫినాలే కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
చివర్లో మరింత రసవత్తరంగా:ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త పద్దతులను తీసుకు వస్తున్నారు. దీంతో చివరి వారాల్లో దీనికి రేటింగ్ ఇంకాస్త పెరిగింది. అదే సమయంలో రసవత్తరంగా మారింది.

వాళ్లు ఔట్.. హౌస్‌లో 7 గురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అలాగే, రతికా రోజ్ రీఎంట్రీ కూడా ఇచ్చింది. ఇలా ఇంత మందిలో జరిగిన 13 వారాల్లో 13 ఎలిమినేషన్స్ (రతికాతో పాటు) జరిగాయి. ఫలితంగా ఇప్పుడు షోలో ఏడుగురు అంటే శివాజి, ప్రశాంత్, అమర్, ప్రిన్స్, శోభా, ప్రియాంక, అర్జున్‌లు ఉన్నారు.
టాప్ 5పై అందరిలో ఆసక్తి:ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న శివాజి, ప్రశాంత్, అమర్, ప్రిన్స్, శోభా, ప్రియాంక, అర్జున్‌లలో ఎవరు టాప్ 5లో ఉంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలా జరగాలంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరు అవుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇలా ఏడో సీజన్ చివరి వరకూ ప్రేక్షకులకు మజాను పంచుతుందని చెప్పొచ్చు.
నామినేషన్స్‌లోకి ఆరుగురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని పద్నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో చూపించారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య ఎన్నో రకాల గొడవలు జరిగాయి. అలా ఫైనల్ అస్త్ర ద్వారా ఇప్పటికే ఫినాలేకు చేరుకున్న అంబటి అర్జున్ మినహా ప్రిన్స్, శివాజి, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, శోభా శెట్టిలు నామినేట్ అయిపోయారు.

ఫైనల్ ఓటింగ్ స్టార్ట్ చేస్తూ:బిగ్ బాస్ షో చరిత్రలో ఫైనల్ విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్ సీజన్ చివరి వారంలో మాత్రమే జరుగుతుంది. ఇండియాలోని ఏ భాషలో అయినా ఇదే పద్దతిని కొనసాగించారు. అయితే, మొదటిసారి ఏడో సీజన్‌లో మాత్రం ఒక వారం ముందు నుంచే ఫినాలే ఓటింగ్‌ను ప్రారంభించారు. ఈ రెండు వారాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే విజేతగా నిలవబోతున్నారు.
అర్జున్‌కు కూడా ఓటింగ్:గత సోమవారం రాత్రి నుంచి ప్రారంభం అయిన ఫినాలే ఓటింగ్‌లో నామినేషన్స్‌లోని లేని అర్జున్‌ను కూడా యాడ్ చేశారు. అతడిని గెలిపించాలి అనుకున్న వాళ్లు ఓటు వేయొచ్చు. అయితే, ఈ వారంలో ఓట్లు తక్కువగా వచ్చినా ఫైనల్ అస్త్ర ఉన్న కారణంగా అతడు ఎలిమినేట్ అవడు. అంటే మిగిలిన ఏడుగురిలోనే ఈ వారం ఒకరు బయటకు వెళ్లిపోతారని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











