మళ్ళీ కలవబోతున్న దీప్తి సునైనా-షణ్ముఖ్ జస్వంత్.. ఆ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానే?
బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత అనూహ్య పరిస్థితుల్లో దీప్తి సునైనా తన ప్రేమికుడు షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారు అంటూ కొత్త ప్రచారం మొదలైంది అసలు వీరిద్దరూ ఎందుకు కలుస్తారు ? దానికి కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బిగ్ బాస్ సీజన్ 3లో
దీప్తి సునయన అనే పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ ఆ తరువాతి కాలంలో యూట్యూబ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగలేకపోయింది కానీ తనీష్ తో ఆమెకు ఏదో ఉంది అన్నట్టు ప్రేక్షకులకు మాత్రం అనుమానం కలిగించేలా ప్రవర్తించింది. ఆ తర్వాత బయటకు వచ్చి తన కెరీర్ పరంగా తాను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళింది.

రిలేషన్ లో
ఆమెతో కలిసి వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ తో ఆమె రిలేషన్ లో ఉందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతూ ఉండేది. కానీ ఆ విషయం మీద వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించింది లేదు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని వారు ఇద్దరూ కూడా ఖరారు చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ సిరి స్నేహం చేసిన విధానం చూసి చాలామంది అతనిని అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.

వీరిద్దరూ కలిస్తే బాగుండు అని
కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆయన కి మంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి సునైనా బిగ్ బాస్ పూర్తయిన పది రోజుల తర్వాత అనూహ్యంగా షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె ఇలా ప్రకటిస్తే షణ్ముఖ్ యశ్వంత్ కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి ఆమె నా వల్ల ఇబ్బందులు పడిందని ఇకనైనా బాగుండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే వీరిద్దరూ కలిస్తే బాగుండు అని వీరి అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

భారీ గెట్ టుగెదర్
దీని మీద ఆ మధ్యకాలంలో షణ్ముఖ్ జస్వంత్ తండ్రి మాట్లాడుతూ ఇది చాలా చిన్న విషయమని, వారు మళ్ళీ కలుస్తాను అని కూడా చెప్పి షాక్ ఇచ్చాడు. తాజా ప్రచారం మేరకు ఈ ఇద్దరూ కూడా ఫిబ్రవరి 14 అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా కలవబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని మొత్తానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక వేదికను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ ఓట్ OTT ప్లాన్ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన టెలికాస్ట్ అయ్యేందుకు గాను ఒక భారీ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారని అంటున్నారు.

భారీ ఎత్తున ఉత్సవంలా
ఆ రోజు 5 సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్ లను ఆహ్వానించి భారీ ఎత్తున ఉత్సవంలాగా చేయబోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాక అదే రోజు ఓటీటీ కూడా లాంచ్ అవుతుందని ఆ లాంచ్ షో కి ఇది కర్టెన్ రైజర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే జరగబోతోందని షూటింగ్ లోనే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే కలిసి స్టేజి మీద ఉండడానికి వారిద్దరూ ఒప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉంటాయనేది ఫిబ్రవరి 14 వస్తే గానీ చెప్పలేము.


Click it and Unblock the Notifications











