Bigg Boss Telugu 7: రక్తం చిందించిన రైతుబిడ్డ.. పల్లవి ప్రశాంత్ గెలుపుకు కారణం వాళ్లేనట.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రెస్పాన్స్ తో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ షో మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 5వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే మొదటి వారంలో కామన్ మ్యాన్ గా ఇంట్లోకి అడుగు పెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఇంట్లో అడుగు పెట్టిన మొదటి వారంలో చాలా నర్వజ్ గా ఫీల్ అయిన ఇతడు.. ఇప్పుడు ఎవరికీ భయపడకుండా చక్కగా ఆట ఆడుతున్నాడు. ముఖ్యంగా స్పెషల్ బాండింగ్, స్నేహితులను ఏర్పరుచుకుని దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

రెండో వారంలో ఇంట్లోని వాళ్లంతా అతడిపై దాడి చేసినా... ముఖ్యంగా అమర్ దీప్ ఓ ఆట ఆడుకున్నా ఏమాత్రం భయపడకుండా ఆయన ఆన్సర్ చెప్పిన తీరు అందరినీ నచ్చింది. హౌస్ మేట్స్ అంతా కలిసి అతడిని కార్నర్ చేయడం చూడలేని శివాది పల్లవి ప్రశాంత్ కు అండగా నిలబడడం.. ఆ తర్వాత నుంచి ఆయన అద్భుతంగా టాస్క్ లు ఆడుతూ.. మంచి పేరు తెచ్చుకోవడంతో టాప్ 5 లిస్టులో చేరిపోయాడు. విన్నర్ కూడా అతడే అవుతాడనే పేరు సంపాధించిన ఈయనకు ఇంట్లో శివాజితో పాటు ప్రిన్స్ యావర్ కూడా చాలా ఇష్టం. స్పై బ్యాచ్ గా ఏర్పడిన వీళ్లు ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడకుండా నిజాయితీగా ఆడుతున్నారు.

Bigg Boss Shares Pallavi Prashanth Journey Video of Bigg Boss Telugu 7

అయితే 15వ వారంలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెందిన జర్నీ వీడియోలను ప్లే చేస్తున్నారు. సోమవారం రోజు అమర్ దీప్, అంబటి అర్జున్ లకు సంబంధించిన వీడియోను ప్లే చేసిన బిగ్ బాస్.. రెండో రోజు ప్రియాంక జైన్, శివాజిల వీడియోలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా మూడో రోజులో భాగంగా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ల వీడియోలను చూపించబోతున్నారు. అయితే ఈరోజు విడుదల అయిన మొదటి ప్రోమోలో ప్రిన్స్ యావర్ జర్నీని చూపించగా.. తాజాగా విడుదల అయిన రెండో ప్రోమోలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ జర్నీని చూపించారు. ఈయన జర్నీ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.

ప్రోమో మొదలవ్వడం మొదలవ్వడమే గార్డెన్ ఏరియాలోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. తన కోసం పెట్టిన ఫొటోలు చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా తన తండ్రి ఫొటోను చూసి ముద్దు పెట్టుకున్నాడు. ఓవైపు ఆనందం, మరోవైపు బాధతో రైతుబిడ్డ కుమిలిపోయాడు. పల్లవి ప్రశాంత్.. మట్టితో మనకు ఉన్న బంధం విడదీయలేనిది అని చెప్పగానే పల్లవి ప్రశాంత్ చాలా ఖుషీగా ఫీలయ్యాడు. అవును అంటూ చెప్పుకొచ్చాడు. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగు పెట్టారని అనగానే.. ఓ సంచి ఎత్తుకుని వచ్చిన ఆయన వీడియోను చూపించారు.

Bigg Boss Shares Pallavi Prashanth Journey Video of Bigg Boss Telugu 7

దొరికిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. టాస్క్ లలో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదని బిగ్ బాస్ వివరించారు. ఆ తర్వాత రైతుబిడ్డ గట్టిగా ఆడిన వీడియోలను ప్లే చేశారు. మీకిక్కడ వివిధ వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది.. మీరు కుమిలిపోయిన ప్రతీసారి లోకం తీరును వివరిస్తూ.. మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేస్తూ.. మీకు ఏడుపు సమాధానం కాదని ఆ స్నేహమే గుర్తు చేసిందని అన్నారు. ఆ తర్వాత శివాజిని ఏడవకూడదని చెబుతున్న వీడియోను చూపించారు. అలాగే నామినేషన్స్ లో మరో పల్లవి ప్రశాంత్ ను చూపించారంటూ వెల్లడించారు.

అలాగే ఆకాశం నుంచి రాలే ప్రతీ నీటి బొట్టు భూమి మీద ఉండే జీవానికి ఓ అవకాశమే అంటూ చెప్పగా.. రైతుబిడ్డ వలవలా ఏడ్చేశాడు. దాన్ని ఒడిసిపొట్టే నైపుణ్యమే విజయం అంటూ చెప్పగా ప్రోమో అయిపోయింది. ఈయన పూర్తి జర్నీ వీడియో చూడాలంటే ఈరోజు రాత్రి వచ్చే పూర్తి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. ముఖ్యంగా రైతుబిడ్డ గెలుపుకు ఆయన స్నేహితులే కారణం అని చెప్పిన బిగ్ బాస్.. ప్రిన్స్ యావర్, శివాజిలను చూపించారు. ఇది గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X