Bigg Boss Telugu 7: ఆయనతో గేమ్ అంటే అంతా వణికిపోతారట.. తొలిసారి సీక్రెట్ షేర్ చేసిన బిగ్‌బాస్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ విపరీతంగా అలరిస్తున్న ఈ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అంతా టీవీల ముందు వాలిపోతున్నారు. ముఖ్యంగా తమకు నచ్చిన వాళ్లని సపోర్ట్ చేస్తూ నచ్చని వాళ్లు ఎలిమినేట్ కావాలని ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 15వ వారంలోకి అడుగు పెట్టింది.

ఈక్రమంలోనే సోమవారం నుంచి రోజుకు ఇద్దరు కంటెస్టెంట్ల చొప్పున జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. మొదటి రోజు అమర్ దీప్, అంబటి అర్జున్ ల వీడియోలు చూపించగా... నిన్న శివాజి, ప్రియాంక జైన్ ల జర్నీ వీడియోలను చూపించారు. ఇక మిగిలింది ప్రిన్స్ యావర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ యే. అయితే ఈరోజు బిగ్ బాస్ టీం నిర్వాహకులు విడుదల చేసిన మొదటి ప్రోమోలో బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోను చూపించారు. యావర్ జర్నీ వీడియోలో ఎన్నో సీక్రెట్ విషయాలను చూపించారు బిగ్ బాస్.

Bigg Boss Shares Prince Yawar Journey Video of Bigg Boss Telugu 7

ప్రోమో ప్రారంభంలోనే ప్రిన్స్ యావర్ గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఇక పెద్ద ఆల్బమ్ లో అతడి ఫొటోలు చూసుకుని మురిసిపోయాడు. ఫుల్ ఎమోషనల్ కూడా అయ్యాడు. తన జర్నీ వీడియో చూస్తున్నంత సేపు యావర్ ఏడుస్తూనే ఉన్నాడు. కేవలం వీడియో చూసినప్పుడు మాత్రమే కాదు ఆయన గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు విన్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. యావర్ మీరొక విషయాన్ని ఇష్ట పడితే దానికోసం ఎంత కష్టపడడానికి అయినా సిద్ధపడే మీ గుణం అందరినీ నచ్చిందని అన్నారు. దానికి ప్రిన్స్ యావర్ థాంక్స్ కూడా చెప్పాడు.

టాస్కుల్లో మీకు ఎవరూ పోటీ కారనే విధంగా.. ప్రతీ టాస్క్ లో మీ ఆధిపత్యం చూపించారని తెలిపారు. యావర్ తో పోటీ అంటే అందరూ ఆలోచించేలా చేశారని అన్నారు. మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ జర్నీ సాఫీగా ముందుకు సాగేలా చేసేందుకు దోహద పడిందని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు. మీ కోపం.. మీ పట్టుదల.. మీకు తప్పు కనిపించిన ప్రతీ చోట కనిపించాయంటూ వివరించారు. అదే ధైర్యం యావర్ ఎవిక్షన్ పాస్ సాధించేలా చేసిందని బిగ్ బాస్ వెల్లడించారు. మీరు ఆ ఎవిక్షన్ పాస్ ను తరిగి సరెండర్ చేసినప్పుడు నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందిరనీ నచ్చిందన్నారు.

Bigg Boss Shares Prince Yawar Journey Video of Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తన గురించి చెబుతున్న మాటలు విన్న యావర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. శివాజి, పల్లవి ప్రశాంత్ లతో తనకు ఉన్న స్నేహబంధం గురించి ప్లే చేసిన షాట్స్ చూసి కూడా చాలా ఏడ్చేశారు. ఇక ఆ తర్వాత యావర్ గతంలో కొట్టిన ఓ డైలాగ్ ను ప్లే చేశారు. నామినేషన్ ఐ డోంట్ లైక్.. బట్ నామినేషన్ లవ్స్ మీ అంటూ చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోను చూస్తే ఆయన అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. అలాగే స్పై బ్యాచ్ అందరికీ యావర్ వీడియో ఫేవరెట్ గా మారుతుంది. మీరూ ఓసారి ఈ అద్భుతమైన వీడియోను ఈరోజుటి ఎపిసోడ్ లో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X