Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైరల్ పిక్ : భర్తపైకి ఎక్కిన బిగ్‌బాస్ శివజ్యోతి.. వేషాలు మామూలుగా లేవే!!
బిగ్‌బాస్ షోతో కొందరు పాపులర్ అయితే.. మరి కొందరు కనుమరగయ్యారు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మూడో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలా మందినే వెలిగి పోతున్నారు. అందులో వరుణ్ సందేశ్, వితికా షెరు, హిమజ, శివజ్యోతి వంటి వారు చాలా మంది ఉన్నారు. యాడ్స్, మూవీస్, సీరియల్స్ అంటూ అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఓ బెంజ్ కారును కొంటే.. శివజ్యోతి సొంతింటి కలను నెరవేర్చుకుంది. సోషల్ మీడియాలో మిగతా అందరి కంటే ఎక్కువగా శివజ్యోతి హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో అందర్నీ ఆకట్టుకుంది.

బిగ్‌బాస్ గంగగా..
బిగ్‌బాస్‌లో నిత్యం ఏడుస్తూ ఉండే శివజ్యోతికి గంగ అంటూ నామకరణం చేశారు. హోస్ట్ నాగార్జున సైతం అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుండేవాడు. అయితే టాస్క్‌ల్లో మాత్రం ఆడపులిలో దూకేది. మగవారితో సరి సమానంగా పార్టిసేపేట్ చేసింది. టాస్కుల్లో గెలిచి కెప్టెన్‌గానూ ఎన్నికైంది.

ఆ ముగ్గురితో..
బిగ్‌బాస్ హౌస్‌లో రోహిణి, అషూ రెడ్డి, హిమజలతో శివజ్యోతి ఎక్కువగా ఉండేది. బాబా భాస్కర్ పప్పీస్ అంటూ వారందర్నీ ఏడిపించేవాడు. అయితే రవి కృష్ణ, అలీ రెజాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన శివజ్యోతి.. సొంత సోదరులను చేసేసుకుంది. బయటకు వచ్చాక కూడా వీరంతా ఎన్నో పార్టీల్లో కలుసుకున్నారు.

గృహ ప్రవేశ వేడుక..
శివజ్యోతి హైద్రాబాద్‌లో ఓ ఇంటిని కొనుక్కుంది. గృహ ప్రవేశ వేడుకకు అలీ రెజా, రవికృష్ణ, వరుణ్, వితికా, రాహుల్, హిమజ ఇలా అందరూ విచ్చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.


స్కూల్ యూనిఫామ్‌లో..
ఇస్మార్ట్ జోడి అంటూ ఓ బుల్లితెర కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో శివజ్యోతి తన భర్త గంగూలితో కలిసి పాల్గొంది. షోలో భాగంగా ఈ ఇద్దరు చిన్న పిల్లలుగా మారిపోయారు. స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం.. భర్త చంకెక్కి శివజ్యోతి కూర్చోడం చేస్తే వీళ్ల వేషాలు మామూలుగా లేవే అని అనిపించక మానదు.