లవ్, బ్రేకప్‌పై కార్తీక దీపం శోభాశెట్టి.. నా లవర్‌తో అలాంటి గొడవలు అంటూ

కార్తీక దీపం సీరియల్‌తో తెలుగునాట పాపులర్ అయ్యారు కన్నడ నటి శోభా శెట్టి. ఈ ఒక్క సీరియల్‌తో ఓవర్‌నైట్ సెలబ్రెటీ అయిపోయారు. ఆమె ఎక్కడ కనిపించినా డాక్టర్ మోనితగానే ఎక్కువ మంది గుర్తుపడతారు. అలా శోభా శెట్టి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది కార్తీక దీపం. ఈ సీరియల్ తర్వాత ఏ తెలుగు సీరియల్‌లోనూ కనిపించలేదు శోభాశెట్టి. సోషల్ మీడియాలోనే అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షో అనే పాడ్‌కాస్ట్‌లో శోభాశెట్టి మెరిసింది. ఈ సందర్భంగా తన కెరీర్, ప్రేమ, ఇతర విశేషాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కార్తీక దీపం తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ప్రత్యక్షమైంది శోభాశెట్టి. అయితే అందరితో గొడవలు పెట్టుకోవడం, నోరేసుకుని పడిపోవడం, ముఖ్యంగా స్పై బ్యాచ్ (శివాజీ, ప్రశాంత్, యావర్)తో గొడవలతో విపరీతమైన నెగిటివిటీ మూట కట్టుకోవడంతో ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేసేశారు. దీని తర్వాత హైదరాబాద్‌కు దూరంగా ఉన్న శోభా శెట్టి .. కన్నడ బిగ్‌బాస్‌లో ప్రత్యక్షమైంది. అక్కడా సేమ్ గొడవలు పెట్టుకుని హౌస్‌లో వాతావరణం చెడగొట్టి.. హోస్ట్ కిచ్చా సుదీప్‌తో చీవాట్లు తినింది. కార్తీక దీపంలో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో ప్రేమలో పడ్డ శోభాశెట్టి.. అతనితో ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. కానీ ఇంత వరకు ఈ జంట పెళ్లి చేసుకోలేదు. తాజాగా కిస్సిక్ టాక్ షోలో అనేక కీలక విషయాలపై శోభాశెట్టి మౌనం వీడారు.

Bigg Boss Shobha Shetty opens up on fight with yashwanth in a podcast hosted by Jabardasth Varsha

నాకూ, యశ్వంత్‌కు గొడవలు
లవ్‌లో సక్సెస్ అయి మ్యారేజ్ వరకు వచ్చారు.. మరి బ్రేకప్ అయినవారికి ఏం సలహా ఇస్తారని వర్ష ప్రశ్నించగా.. శోభాశెట్టి ఎమోషనల్ అయ్యారు. లవ్‌లో సక్సెస్ అని అనకూడదని.. ప్రతి ఒక్కరి జీవితంలో ఫైట్, గొడవ అనేది కామన్ అని శోభాశెట్టి అన్నారు. గొడవ అనేది లేకపోతే ప్రేమ లేదని.. నాకు, యశ్వంత్‌కు మధ్య కూడా ఎన్నోసార్లు గొడవ జరిగిందని బయటపెట్టారు. కానీ అర్ధం చేసుకునే దానిలో అసలు విషయం ఉంటుందని శోభాశెట్టి అన్నారు. మన వయసేంటీ? ఎక్కడి నుంచి వచ్చాం? ఏ జనరేషన్‌లో ఉన్నాం? సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటివి చూస్తున్నాం అలాంటప్పుడు మన జీవితాలకు ఒక క్లారిటీ వస్తుందన్నారు.

ప్రేమే జీవితం
జీవితంలో ప్రేమికులిద్దరూ బాగుండాలంటే అర్ధం చేసుకోవడం ముఖ్యమని ఆమె అన్నారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండాలని.. ఏదో నాతో ఉంది.. దానిని చూసుకోవాలి, ఇక తప్పదు అనుకోకూడదని శోభాశెట్టి సలహా ఇచ్చారు. జీవితంలో ప్రేమ తర్వాత ఏదైనా అని.. ఒక మనిషికి ప్రేమ అనేది లేకపోత జీవితం బాగోదని చెప్పారు. మనమంటే ఒకరు ప్రేమ చూపిస్తున్నారని చెప్పుకోవడానికి ఒకరు ఉండాలని అన్నారు.

తల్లిదండ్రుల్ని తలచుకోవాలి
ఇష్టమైన వాళ్లని మోసం చేసేవాళ్లకి మీరేం చేస్తారని వర్ష అడగ్గా.. నీకు వెంటనే కర్మ వచ్చేస్తుందని శోభ చెప్పింది. ఒకరిని బాధపెట్టి, ఏడిపించి భవిష్యత్తులో నువ్వు బాగుపడవని శోభాశెట్టి తెలిపింది. ఇప్పుడు బాగున్నా.. రేపటి రోజున కర్మ నిన్ను వెంటాడుతుందని ఆమె హెచ్చరించింది. నీకు చేతనైతే పదిమందికి మంచి చేయ్.. లేదంటే సైలెంట్‌గా ఉండిపో అని సూచించారు. ప్రేమలో మోసపోయిన వాళ్లు సూసైడ్ చేసుకోవడానికి ముందు తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించాలని శోభాశెట్టి హితవు పలికారు. నీ దగ్గర ఆస్తులు, అందం ఉన్నంత కాలమే నీతో ఉంటారని సూచించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X