ఆరియానాను ఆ జంతువుతో పోల్చి.. హారిక హైట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి.. ఏడిపించేశాడుగా!

తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించారు నిర్వహకులు. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇక, ప్రస్తుతం ఫినాలే వీక్‌లో ఉన్న నాలుగో సీజన్‌లో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాప్ -5 కంటెస్టెంట్లకు బిగ్ బాస్ భారీ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆరియానా, హారికను ఘోరంగా ఏడిపించాడు. ఆ వివరాలు మీకోసం!

ఐదుగురు కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరు

ఐదుగురు కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజీత్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు మాత్రమే టాప్ -5లోకి చేరారు. వీరిలో ఎవరు విన్నర్ అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. బయట ఓటింగ్ ట్రెండ్‌ ప్రకారం.. అభిజీత్‌ నాలుగో సీజన్‌ను గెలుచుకుంటాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆదివారమే బిగ్ బాస్ ఫినాలే.. గెస్టుగా

ఆదివారమే బిగ్ బాస్ ఫినాలే.. గెస్టుగా

కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడింది. డిసెంబర్ 20న అంటే వచ్చే ఆదివారమే ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ఆరోజే విన్నర్‌ను కూడా ప్రకటించబోతున్నారు. ఇక, దీనికి గెస్టుగా వచ్చే హీరో విషయంలో ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవే మరోసారి రాబోతున్నారని తెలిసింది.

కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు

కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు

నాలుగో సీజన్‌లో చివరి వారం జరుగుతుండడంతో బిగ్ బాస్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే హౌస్‌లో టాస్కులు తీసేసిన నిర్వహకులు.. మాజీ కంటెస్టెంట్లు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రేజాలను తీసుకొచ్చి ఫినాలే కోసం ఐదుగురు సభ్యులకు సలహాలు సూచనలు ఇప్పించారు. ఆ తర్వాత టాప్ -5 కంటెస్టెంట్ల కోసం స్పెషల్ ప్లాన్లు అమలు చేస్తున్నారు.

ఫినాలేకు ముందు జోష్ నింపేందుకు

ఫినాలేకు ముందు జోష్ నింపేందుకు

మరికొద్ది రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో ఉండబోతున్న ఐదుగురు కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ మంచి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు హౌస్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఒక్కో కంటెస్టెంట్‌కు జర్నీ వీడియో చూపిస్తున్నాడు. అంతేకాదు, ప్రతి ఒక్క కంటెస్టెంట్‌పై తన అభిప్రాయం చెబుతూ.. ఫినాలేకు ముందు వాళ్లలో జోష్‌ను నింపే ప్రయత్నం చేస్తున్నాడు.

హారిక హైట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి

హారిక హైట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి

గురువారం ఎపిసోడ్‌ను దేత్తడి హారిక జర్నీతో ప్రారంభించారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్పెషల్ సెటప్‌కు వచ్చిన ఆమెతో ‘మిమ్మల్ని ఎన్ని మేఘాలు కప్పేసినా.. సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్‌కి చేరుకున్నారు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వాఖ్యాన్ని నిజం చేస్తూ ఫైనల్‌కు చేరారు' అంటూ ఆమెలో ఉత్సాహాన్ని నింపుతూ ఏడిపించాడు బిగ్ బాస్.

ఆరియానాను ఆ జంతువుతో పోల్చి

ఆరియానాను ఆ జంతువుతో పోల్చి

ఆరియానాను ప్రశంసలతో ముంచెత్తాడు బిగ్ బాస్. ‘అరియానా మీరు హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక సంచలనం. మీరు మొదటి రోజు నుంచి ఈరోజు వరకూ వేగాన్ని తగ్గించలేదు. ఆటను గెలవాలనే కోరుకున్నారు. అందరి గురి మీపైనే ఉన్నా.. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొన్నారు. మీ గమ్యమే లక్ష్యంగా ఎంచుకుని అడవి గుర్రంలా మందుకు సాగారు' అంటూ చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X