Bigg Boss Telugu 7: ఓటింగ్ విషయంలో బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్... విజేత ఎవరు కానున్నారంటే!

బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక నామినేషన్స్‌లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారు. కానీ అర్జున్ కి కూడా ఓటింగ్ ఇచ్చారు. ఫినాలే ఎంట్రీ కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు గుడ్ బిగ్ బాస్ అంటూ మెచ్చుకుంటున్నారు. మరీ గత సీజన్స్ కు ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 14వ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో అర్జున్ అంబటి తప్ప.. మిగతా ఆరు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనాలిస్టుగా ఎంపిక కావడంతో.. ఆయన సేఫ్ అయ్యాడు. అయినప్పటికీ బిగ్ బాస్.. ఫినాలే కోసం ఓటింగ్ మొదలుపెట్టాడు. దీంతో ఈ వారం ఒకరు.. మిడ్ వీక్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ డిసెంబర్ 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి.

Bigg Boss Shocking Decision About Fake Votes in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఈ క్రమంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఓటింగ్ మొదలు పెట్టారు. అంతే కాదు.. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు పీఆర్ టీమ్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. పీఆర్ టీమ్స్ అనగా.. కంటెస్టెంట్ కు అనుకూలంగా పనిచేయడం. తమ కంటెస్టెంట్ ను హైలెట్ చేసుకునేందుకు కొన్ని పీఆర్ టీమ్స్ లిమిట్స్ క్రాస్ చేసి.. ఫేక్ వీడియోలు, ఫేక్ ఓటింగ్ మొదలుపెడుతుంది. ఫేక్ మెయిల్ ఐడీలు సృష్టించి.. ఫేక్ ఓటింగ్ వేస్తుంటారు.

ఇక అలా చేయడం వల్ల అసలైన విజేతకు నష్టం వాటిల్లొచ్చు. గత సీజన్స్ లో కూడా ఓసారి విన్నర్ కంటే.. కూడా మరో వ్యక్తికి ఫేక్ ఓట్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆదరణ పొందిన కంటెస్టెంట్ కంటే.. వేరే కంటెస్టెంట్ ను విజేత చేయాల్సి వచ్చింది. అలా ప్రైజ్ మనీ ఒకరికి.. విన్నర్ టైటిల్ ఒకరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని.. బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేసినట్లు తెలస్తుంది.

Bigg Boss Shocking Decision About Fake Votes in Bigg Boss Telugu 7 Full Details Here

ఓటింగ్ విషయంలో బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఫేక్ ఓటింగ్ అరికట్టేందుకు బిగ్ బాస్ ఓ కొత్త ప్లాన్ వేశాడు. ఓటింగ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే ఆ ఓటింగ్ లో కంటెస్టెంట్స్ పీఆర్ టీమ్స్ ఫేక్ ఓట్స్ వేసే అవకాశం ఉందని... ఫిల్టర్ యాడ్ చేయనున్నారట. దీంతో ఫేక్ ఓటింగ్ అందులో నమోదు కాదు. అయితే వీరికి ఓటు వేసినట్లు కనిపించినా... ఆ ఫేక్ ఓట్లు మాత్రం అందులో నమోదు కాదని తెలుస్తోంది.

దీనివల్ల అసలైన విజేతకు నష్టం వాటిల్లదు. బిగ్ బాస్త తెలుగు 7 విన్నర్ .... ప్రేక్షకులు ఎన్నుకున్న వారే అవుతారు. అలా బిగ్ బాస్ నిర్ణయం, స్ట్రాటజీ సూపర్ అంటున్నారు ప్రేక్షకులు. మరి ఇన్నాళ్లు ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మంచి పని చేశావ్ బిగ్ బాస్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X