బిగ్‌బాస్ షో చూస్తే.. బ్రోతల్ హౌస్‌లా ఉంది, శ్రీరెడ్డి ఘాటైన కామెంట్స్
వివాదాస్పద సెలబ్రిటీ శ్రీరెడ్డి మరోసారి బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోపై భగ్గుమన్నది. ఆ షోలో పాల్గొనాలని గంపెడు ఆశలు పెట్టుకొన్న ఆమె అవకాశం దక్కకపోవడంతో తాజాగా మండిపాటును ప్రదర్శించినట్టు కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని శ్రీరెడ్డి బిగ్‌బాస్ నిర్వాహకులపై బిగ్ బాంబు వేసింది. బిగ్‌బాస్ సెలబ్రిటీల ఆడిషన్ సెలక్షన్ ప్రాసెస్‌లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పూసుగుచ్చినట్టు సోషల్ మీడియాలో వెళ్లగక్కింది.
బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనాలని కొందరు నిర్వాహకులు ప్రముఖ హోటల్‌లో తనతో సంప్రదింపులు జరిపారు. వారి కోరిక మేరకు హోటల్‌కు వెళ్లిన తర్వాత వారు అడిగిన ప్రశ్నలకు కంగు తిన్నాను. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక చాలా సంబంధాలు పెట్టుకోవాలి.. అందుకు సిద్ధమేనా అని నిర్వాహకులు నన్ను ప్రశ్నించారు. అందుకు తాను ఇబ్బందికి గురయ్యానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

తన శారీరక సౌందర్యంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎదను చూపిస్తూ అవి ఒరిజినలా? వాటికి సర్జరీ ఏమైనా చేయించావా అని ప్రశ్నించారు. వారు అడుగుతున్న ప్రశ్నలకు నాకు విపరీతమైన కోపం వచ్చిందని, వారి ప్రశ్నలను తట్టుకోలేక.. మీకేమైనా డౌటా? విప్పి చూపించాలా? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చానని శ్రీరెడ్డి తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌లో పాల్గొనకపోవడమే మంచిదనే ఫీలింగ్ కలుగుతున్నది. ఇంటిలో సెలబ్రిటీలను, వారి ప్రవర్తనను చూస్తే ఎబ్బెట్టుగా ఉంది. నాకైతే బిగ్‌బాస్ హౌస్ ఓ బ్రోతల్ హౌస్'గా కనిపిస్తున్నది అని శ్రీరెడ్డి కామెంట్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











