Bigg Boss: బిగ్ బాస్ షోలో సంచలనం.. కంటెస్టెంట్‌పై కేసు నమోదు.. అలా మాట్లాడినందుకే!
ఎక్కడో హాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ షో... ఇండియాకు పాకింది. అలా ఇండియాలో మొదటగా హిందీలో బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ లకు వచ్చి చేరింది. ఇక బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ కన్నడ, బిగ్ బాస్ తమిళ, మలయాళ భాషలకు చేరి.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కేసు నమోదు అయిందని తెలుస్తోంది. షోలో ఆ కంటెస్టెంట్ ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటంతో.. కేసు నమోదు అయిందట. అసలు ఏం జరిగింది.. ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షాకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇది హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు, తమిళ్ లో సీజన్ 7 నడుస్తుంది. కన్నడ భాషలో మాత్రం సీజన్ 10 నడుస్తోంది. అయితే కన్నడ బిగ్ బాస్ షోలో ఓ వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కేసు నమోదు అయిందని సమాచారం. షోలో కంటెస్టెంట్ ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడం వల్లే కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో అనగానే మనకు గొడవలు గుర్తుకు వస్తాయి. అందరూ కప్ కొట్టాలనే ఉద్దేశంతో.. రెచ్చిపోయి మరీ గొడవలు పెట్టుకుంటూ.. ఫేమస్ అవ్వాలని చూస్తారు. అలా ఆ క్రమంలోనే వివాదాలు వస్తుంటాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్10 నడుస్తోంది. అయితే కన్నడ షోలో వివాదాలు ఎక్కువవుతున్నాయని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో సుదీప్ విలన్ గా నటించారు. ఆయన కన్నడంలో పెద్ద హీరో అనే విషయం తెలిసిందే. ఇక కన్నడ బిగ్ బాస్ షోకి ఆయనే హోస్టుగా చేస్తున్నారు. చాలా సీజన్స్ ఆయనే హోస్టుగా చేశాడు. ఇక 10వ సీజన్ కూడా సుదీప్ హోస్టుగా బిగ్ బాస్ షో కొనసాగుతోంది. కొన్నాళ్ల ముందు ఈ షోలో ఓ కంటెస్టెంట్ పులిగోరుతో ఉన్న లాకెట్ వేసుకోవడం గమనించిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆ వివాదం మరిచిపోకముందే.. మరో వివాదం తలెత్తింది ఈ షోలో. ఇప్పుడు ఓ లేడీ కంటెస్టెంట్ పై అట్రాసిటీ కేసును నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల నవంబరు 8న ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ లో భాగంగా తనీషా అనే లేడీ కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్ తో మాట్లాడుతూ వివాదంలో ఇరుక్కుంది. ఆమె మాట్లాడే క్రమంలో 'వడ్డా' అని మాట్లాడింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట‍్ర అధ్యక్షురాలు పద్మ.. తనీషాతో పాటు సదరు టీవీ ఛానెల్ పై పోలీసు కేసు పెట్టింది. పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగమని.... అయితే బిగ్ బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం సరికాదని పద్మ పోలీసు ఫిర్యాదులో పేర్కోంది. అంతే కాదు ఇది రెండోసారి అని తన ఫిర్యాదులో రాసుకువచ్చింది. గత సీజన్ లో కూడా నటుడు సిహి కహీ చంద్రు ఇలాంటి పదాన్ని వాడారని... ఆ తర్వాత క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా మతాలను కానీ, కులాలను కానీ కించపరచకూడదని రూల్ ఉంటుంది. అలా చేస్తే.. డైరెక్టుగా ఎలిమినేట్ అవుతారనే ఒప్పందం కూడా ఉంటుంది. అయినా చాలా మంది కంటెస్టెంట్స్ నోరు జారి ఇలా బుక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











